రెవెన్యూ కార్యాలయాల్లో ప్రజలు కూర్చునేందుకు కుర్చీలు ఏర్పాటు చేయాలి: పాడేరు సబ్ కలెక్టర్ అభిషేక్

చింతపల్లి:
రెవెన్యూ కార్యాలయాల్లో వివిధ పనుల నిమిత్తం వచ్చే ప్రజలు కూర్చునేందుకు కుర్చీ లను ఏర్పాటు చేయాలని పాడేరు సబ్ కలెక్టర్ అభిషేక్ అన్నారు. సోమవారం చింతపల్లి మండలంలో పర్యటించిన సబ్ కలెక్టర్, స్థానిక రెవెన్యూ కార్యాలయాన్ని సందర్శించారు. కార్యాలయం వద్ద వివిధ పనుల నిమిత్తం వచ్చిన ప్రజలు నించొని నిరీక్షిస్తున్నా  తీరును స్వయంగా పరిశీలించిన ఆయన  రెవెన్యూ ఉద్యోగుల తో మాట్లాడుతూ, వివిధ అవసరాల కోసం వచ్చిన ప్రజలు కూర్చునేందుకు బెంచీలు ఏర్పాటు చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో ఉప తాసిల్దార్ తిరుమల బాబు పాల్గొన్నారు .  

Post a Comment

0 Comments