అత్యంత వైభవంగా పాడేరు మోదకొండమ్మ అమ్మవారి వార్షిక శాకాంబరీ మహోత్సవము

పాడేరు(డేవిడ్): పాడేరు మోదకొండమ్మ అమ్మవారి వార్షిక శాకాంబరీ మహోత్సవము అత్యంత వైభవంగా ఆదివారం జరిగింది.  ఈరోజు అమ్మవారు శాకంబరి దేవీగా అలంకరించుకొని భక్తులకు దర్శనమిచ్చారు. అమ్మవారిని ప్రత్యేక అలంకారం గా వివిధ రకాలైన కూరగాయలతో సుందరంగా తీర్చిదిద్దారు. ఆలయ కమిటీ చైర్ పర్సన్ భాగ్యలక్ష్మి వారి ఆధ్వర్యంలో ప్రత్యేక ఏర్పాట్లు చేశారు.  ఉదయం 5 గంటల నుంచి భక్తులు పోటెత్తారు. అమ్మవారిని దర్శనం చేసుకునేందుకు క్యూ కట్టారు.    అరకు పార్లమెంట్ సభ్యురాలు గొట్టేటి మాధవి దంపతులు, అరకు శాసనసభ్యులు శెట్టి పాల్గుణ, ట్రైకార్ చైర్పర్సన్ శతక బుల్లిబాబు , ఐటీడీఏ ప్రాజెక్టు అధికారి రోణంకి గోపాలకృష్ణ ,సబ్ కలెక్టర్ వి అభిషేక్, ఆంధ్రప్రదేశ్ మెడికల్ కౌన్సిల్ సభ్యులు తమర్బ నర్సింగరావు ,మాజీ మంత్రివర్యులు మత్స్యరాస మణికుమారి , బొర్రానాగరాజు, ఆలయ కమిటీ ప్రధాన కార్యదర్శి సింహాచలం నాయుడు  ,కమిటీ సభ్యులు నాగేశ్వరరావు, శివరాత్రి శ్రీను ,గోపి, పలాసి బాలన్న కొట్టగుళ్ళి  రామారావు ఇతర ఆలయ కమిటీ సభ్యులు పాల్గొన్నారు. మధ్యాహ్నం 12 గంటల నుండి భక్తులకు అన్నసంతర్పణ కార్యక్రమం జరుగింది, ఈ కార్యక్రమంలో  భక్తులు పాల్గొన్నారు, ఆలయం వద్ద పోలీసు బందోబస్తు ఏర్పాటు చేసి భక్తులకు గుడిలోకి కోవిడ్ నిబంధనల కనుగుణంగా దర్శనాలు చేయించారు. 

Post a Comment

0 Comments