నైతికంగా దిగజారిపోయి ఉద్యం నుంచి పారిపోయిన పెదబయలు-కోరుకొండ ఏరియా కమిటీ కార్యదర్శి సుధీర్: విశాఖ ఈస్టుడివిజన్ కమిటీ కార్యదర్శి అరుణ

చింతపల్లి: పెదబయలు-కోరుకొండ ఏరియా కమిటీ కార్యదర్శి, కమాండర్ సుధీర్ రాజకీయంగా, నైతికంగా దిగజారిపోయి ఉద్యమం నుంచి పారిపోయాడని విశాఖ-ఈస్టు డివిజన్ కార్యదర్శి అరుణ ఆరోపించారు. శనివారం ఆమె ఒక ప్రకటన విడుదల చేశారు. విశాఖ ఈస్టు డివిజన్ కమిటీ సభ్యుడు, పెదబయలు-కోరుకొండ ఏరియా కమిటీ కార్యదర్శి సుధీర్ ప్రస్తుతం మావోయిస్టు ఉద్యమంపై తీవ్రమైన శత్రువు దాడి, నిర్బంధాన్ని రాజకీయంగా అర్థంచేసుకోలేదన్నారు. ప్రాణ భయంతో స్వార్థంతోను, వ్యక్తిగత జీవితం కోసం ఉద్యమానికి ప్రజలకు ద్రోహం చేసి పారిపోయాడన్నారు. గతంలో పారిపోయిన మహిత అనే అమ్మాయిని కూడా తీసుకొని
వెళ్లిపోయాడని, అతని భార్య పిల్లలకు, కూడా మోసం చేశాడని ఆరోపించారు. ఈ ద్రోహాని పాల్పడిన సుధీర్ ని మావోయిస్టు పార్టీ నుంచి బహిష్కరిస్తున్నామన్నారు. ప్రజలు ఎవరు సహకరించరాదన్నారు.

Post a Comment

0 Comments