కోవిడ్ మరణాలు జాతీయ విపత్తుగా పరిగణించాలి..ఉపాధ్యాయ మృతులకు రూ .50 లక్షల ఎక్స్ గ్రేషియా చెల్లించాలి:ఎమ్మెల్సీ పాకలపాటి రఘువర్మ

చింతపల్లి(వి.డేవిడ్): కోవిడ్ మరణాలను జాతీయ విపత్తుగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పరిగణించాలని ఉత్తరాంధ్ర ఉపాధ్యాయ ఎమ్మెల్సీ పాకలపాటి రఘువర్మ డిమాండ్ చేశారు. శనివారం చింతపల్లి మండంలో కోవిడ్ తో మరణించిన ఉపాధ్యాయుల కుటంబాలను ఎమ్మెల్సీ, ఏపీటీఎఫ్ నాయకులు పరామర్శించారు. ఉపాధ్యాయుల చిత్రపటాలకు పూలమాలవేసి నివాళి ఘటించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్సీ మాట్లాడుతూ, కోవిడ్ తో మరణించిన ప్రతి కుటుంబానికి రూ .50 లక్షల ఎక్స్ గ్రేషియా ఇవ్వాలన్నారు. మృతులు కుటంబంలో ఒకరికి అర్హుతలు ప్రాతిపదికన ఉద్యోగాలు ఇవ్వాలన్నారు. అర్హతలు కలిగిన వ్యక్తులకు కూడా నాల్గోతరగతి ఉద్యోగాలు ఇవ్వడం సరైంది కాదని జిల్లా కలెక్టర్ దృష్టికి తీసుకొని వెళ్లామన్నారు. కారుణ్య నియామకాలపై ప్రత్యేక దృష్టిసారించాలని రాష్ట్ర మఖ్యకార్యదర్శి దృష్టికి కూడా తీసుకొనివెళ్లామన్నారు. ఉత్తరాంధ్రలో 200 మంది, ఏజెన్సీ 40 మంది ఉపాధ్యాయులు మరణించారని, ప్రతి కుటుంబాన్ని పరామర్శించి, మనోధైర్యం కల్పిస్తున్నామన్నారు. ప్రభుత్వం నుంచి రావాల్సిన రాయితీలు అందించేందుకు యూనియన్ నాయకులు కృషిచేస్తున్నారన్నారు. అలాగే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అమలుపరుస్తున్న నూతన విద్యా విధానం వల్ల పలు రకాల సమస్యలు ఎదురుకావాల్సిన పరిస్థితి ఉందన్నారు. మూడు నుంచి ఐదు తరగతులు విద్యార్ధులు పొరుగు పాఠశాలకు పంపించాల్సివస్తే డ్రాప్ అవుట్స్ పెరిగిపోతాయన్నారు. ఏజెన్సీలో ఈ నూతన విధానం ఎట్టి పరిస్థితితుల్లోనూ సత్ఫలితాలు
ఇచ్చే పరిస్థితి లేదని, దీనిపై ప్రభుత్వం పునరాలోచన చెయ్యాలన్నారు. ఈ కార్యక్రమంలో ఏపీటీఎస్ ప్రధాన కార్యదర్శి వెంకటపతి రాజు జిల్లా, అధ్యక్షుడు కె.శ్రీనివాస్, కార్యదర్శి రామకృష్ణ, రాష్ట్ర కౌన్సిల్ సభ్యుడు బౌడు గంగరాజు, మండల అధ్యక్ష, కార్యదర్శిలు సోమలింగం, సింహాచలం నాయుడు, చౌడుపల్లి, లంబసింగి ప్రధానోపాధ్యాయులు లోచలి చిట్టినాయుడు, పనసల ప్రసాద్, గిరిజన ఉద్యోగ సంఘం నాయకులు దేపూరి శశి కుమార్, కోటేశ్వరరావు, వెంకటేశ్వర్లు పాల్గొన్నారు.

Post a Comment

0 Comments