విశాఖపట్నం: లాక్‌డౌన్ కారణంగా మూతపడిన పరిశ్రమల్లోని రెగ్యులర్, ఒప్పంద కార్మికులకు మార్చి నెల జీతాలను యాజమాన్యాలు వెంటనే చెల్లించాలని.. లేకపోతే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని కార్మికశాఖ ఉప కమిషనర్ వెంకటరమణ పట్నాయక్ హెచ్చరించారు. ఏప్రిల్ నెల జీతాలు కూడా చెల్లించేందుకు తగు చర్యలు తీసుకోవాలన్నారు. గతనెల జీతాల చెల్లింపులకు సంబంధించిన వివరాలను కార్మికశాఖ మెయిల్ dclvizag.labour@gmail.comకు పంపాలన్నారు. వలస కార్మికుల జీతాలు, వసతి సమస్యల పరిష్కారానికి కలెక్టరేట్‌లోని కంట్రోల్ రూం 1800 4250 0002కు ఫిర్యాదు చేయాలని సూచించారు.
0 Comments