రేపటి నుంచి పదో తరగతి విద్యార్థులకు రేడియో పాఠాలు :జిల్లా విద్యాశాఖాధికారి బి. లింగేశ్వర రెడ్డి


విశాఖపట్నం(అన్వేషణ అప్ డేట్): 
లాక్ డౌన్ కారణంగా పదో తరగతి విద్యార్థులకు బుధవారం నుంచి ఎఫ్ఎం 102.2ఎంహెచ్ జెడ్ బ్యాండ్ పై రేడియో పాఠ్యాంశాల బోధన నిర్వహించనున్నట్టు జిల్లా విద్యాశాఖ అధికారి బి. లింగేశ్వర రెడ్డి తెలిపారు. సోమవారం జిల్లా విద్యాశాఖ అధికారి ఒక పత్రికా ప్రకటన విడుదల చేశారు. కోవిడ్ - 19 వ్యాప్తిని నివారించేందుకు   జిల్లాలోని అన్ని పాఠశాలలకు ఇదివరకే లాక్ డౌన్ ప్రకటించామన్నారు.  పదో తరగతి పరీక్షల నేపథ్యంలో ఈ నెల 22 నుంచి రేడియో పాఠ్యాంశాల బోధన నిర్వహించడం జరుగుతుందన్నారు.  ఈ మేరకు జిల్లాల ఉప విద్యాశాఖాధికారులు, మండల విద్యాశాఖాధికారులు, సెకండరీ పాఠశాలల ప్రధానోపాధ్యాయులు, 10వ తరగతి చదువుచున్న విద్యార్థులు, వారి తల్లిదండ్రులు రేడియో పాఠ్యాంశాల బోధనను సద్వినియోగం చేసుకునే విధంగా చర్యలు తీసుకోవాలన్నారు.  సమగ్ర శిక్ష, ఆంధ్రప్రదేశ్ వారు రేడియో ద్వారా అన్ని పాఠ్యాంశాల్లో  ముఖ్యమైన అంశాలను వివరించడం జరుగుతుందన్నారు. 

ఎఫ్.ఎం, రైన్ బో, విశాఖపట్నం (102. 2 MHz) నందు ప్రసారము చేయబడును కాలమాన వివరాలు...
 

Post a Comment

0 Comments