పాత్రికేయులకు బియ్యం మాస్క్ ల పంపిణీధర్జీల సంఘ అధ్యక్షుడు షేక్ రహిమాన్(బుజ్జి)

చింతపల్లి (షేక్ కాశిమ్ వలీ) : వేతనాలు లేకున్నా ప్రజా సమస్యలపై నిత్యం శ్రమించే పాత్రికేయులకు కరోనా కష్టకాలంలో  బియ్యం, మాస్క్ లను చిరు పంపిణీ చేయడం తనకెంతో ఆనందాన్ని కలిగించిందని చింతపల్లి ధర్జీల (టైలర్స్) సంఘం  అధ్యక్షుడు షేక్ రహిమాన్ (బుజ్జి) అన్నారు. స్థానిక పాత్రికేయులకు ఆదివారం ఆయన ఐదు కిలోల నాణ్యమైన బియ్యం, మాస్క్ లను వితరణగా అందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజాసమస్యలను వెలుగులోకి తెచ్చి ప్రజలకు, ప్రభుత్వాలకు వారదులుగా ఉండడమే గాక  అధికారుల దృష్టికి సమస్యలను తీసుకువచ్చి పరిష్కరించే విధంగా వార్తల ప్రచురణ కోసం పరితపించే పాత్రికేయులకు తనవంతు సాయంగా (చిరుకానుకగా) బియ్యం అందించగలగడం ఆనందంగా ఉందన్నారు. ముఖ్యంగా మన్యప్రాంతంలో పాత్రికేయుల సేవలను ప్రభుత్వాలు గుర్తించి వేతన సదుపాయం కల్పిస్తే వారు మరింత ఉత్సాహంగా వృత్తిధర్మాన్ని నెరవేర్చేందుకు తోడ్పాటును అందినవారవుతారని ఆయన అబిప్రాయం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో దర్జీల సంఘం నాయకులు షేక్. మీరా, నాజర్ వలీ(బీబీసీ బాబు),నాగూరు. పాత్రికేయులు పాల్గొన్నారు.

Post a Comment

0 Comments