నిరుపేదలు, బడుగు బలహీన వర్గాలకు వైసీపీ ప్రభుత్వం అండగా నిలుస్తుందని నర్సీపట్నం కాలనీ వార్డు ఇంచార్జ్ మర్రా నాగరాజు అన్నారు. ఆదివారం వైసిపి గౌరవ అధ్యక్షురాలు విజయమ్మ జన్మదినం పురస్కరించుకొని పట్టణం ఎస్సీ కాలనీ మూడవ వార్డు ప్రజలకు 5 కిలోల బియ్యం, అవసరమైన నిత్యావసర సరుకులను నాగరాజు, రాములమ్మ దంపతులు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా నాగరాజు మాట్లాడుతూ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి తల్లి, రాష్ట్ర ప్రజల ఆశాజ్యోతి విజయమ్మ కు ఆయురారోగ్యాలు, సుఖసంతోషాలు, చిరాయువుని దేవుడు ఆ తల్లికి అనుగ్రహించాలని కోరుచున్నామన్నారు. ప్రస్తుతము కరోనా వైరస్ కారణంగా ప్రజలు తీవ్ర ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కొంటున్నారని, కనీసం నిత్యావసర సరుకులు కూడా అందుబాటులో లేక అర్ధాకలితో జీవిస్తున్నారు. ఈ నేపథ్యంలో నర్సీపట్నం ఎమ్మెల్యే పెట్ల ఉమాశంకర్ సూచన మేరకు పార్టీ గౌరవాధ్యక్షురాలు జన్మదినం పురస్కరించుకొని కాలనీలో 700 నిరుపేద కుటుంబాల ప్రజలకు అవసరమైన సరకులను తనవంతు సహాయంగా అందించాలన్నారు. ఈ కార్యక్రమంలో వార్డు వైసిపి నాయకులు పాల్గొన్నారు .
0 Comments