చింతపల్లి (షేక్ కాశిమ్ వలీ) : సమయంతో పనిలేకుండా శ్రమించే శ్రామికులు పాత్రికేయులని సీనియర్ జర్నలిస్ట్, విశాలాంధ్ర బ్యూరో చీఫ్ డాక్టర్ విశాలాంధ్ర బ్యూరో చీఫ్ డాక్టర్ ఎంఆర్ఎన్ వర్మ అన్నారు. ఆదివారం ఆయన మాట్లాడుతూ ప్రపంచాన్ని అతలాకుతలం చేస్తూ అగ్రరాజ్యాలలో మృత్యు గంటికలు మోగిస్తున్న కంటికి కనిపించని శత్రువు (కరోనా వైరస్) పై కలం పోరాటం చేస్తున్న పాత్రికేయుల సేవలను కేంధ్ర, రాష్ట్ర ప్రభుత్వాలు గుర్తించాలని అన్నారు. వైధ్యారోగ్య, పోలీసు, రెవెన్యూ, మండల పరిషత్, పంచాయతీ, గ్రామ సచివాలయం, వలంటీర్ల వ్యవస్థలతో పాటు ముఖ్య భూమిక పోషిస్తున్న పాత్రికేయులకు ప్రభుత్వాలు కనీస ప్రోత్సాహం ఇవ్వకపోవడం బాధాకరమన్నారు. కరోనా వంటి విపత్కర పరిస్థితుల్లోనూ సమస్యను ప్రజల్లోకి తీసుకువెళ్ళడంలో పాత్రికేయులు పడుతున్న తపన అభినందనీయమన్నారు. ప్రభుత్వాలు మొదలుకుని ప్రజాప్రతినిధులు, అధికారులు చేపడుతున్న ప్రతీ కార్యక్రమాన్ని ప్రస్తుత పరిస్థితులకు తగినట్లుగా ప్రచురించేందుకు వారు పడుతున్న తాపత్రయాన్ని ప్రత్యక్షంగా చూడడం జరిగిందన్నారు. ఇటువంటి పాత్రికేయ వ్యవస్థను కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు గుర్తించాలన్నారు. కరోనా విలయం కారణంగా దేశవ్యాప్తంగా లాక్ డౌన్ ప్రకటించి దాదాపు నెలరోజులు కావస్తున్నప్పటికీ ప్రజలంతా ఇళ్ళకే పరిమితం కావాలని ప్రభుత్వాలు, అధికారులు చెబుతున్న సమాచారాన్ని సామాజిక మాద్యామాల ద్వారా ప్రజలకు తెలియపరచే పాత్రికేయులకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల ద్వారా నేటికీ ఎటువంటి రక్షణ (మాస్క్ లు, శానిటైజర్లు, గ్లౌజులు,), వృత్తి , ఆరోగ్య భధ్రత కల్పించకపోవడం విచారకరమన్నారు ఇప్పటికైనా పాత్రికేయుల సేవలను ప్రభుత్వాలు గుర్తించాలని ఆయన కోరారు.
0 Comments