చాకిబండ గ్రామంలో మరణించిన ఓ వృద్ధురాలికి అంత్యక్రియలు నిర్వహించి మానవత్వం చాటుకున్నారు ఎస్.ఐ హేమాద్రి.. వివరాల్లోకి వెళితే.. చిన్నమండెం మండలం లోని చాకిబండ గ్రామానికి చెందిన లక్ష్మీదేవి (60) ఒంటరిగా జీవిస్తోంది. ఆమె కొద్దికాలంగా అనారోగ్యం తో బాధపడుతోంది. 20 ఏళ్లుగా అద్దె ఇంట్లో ఉంటూ కూలీ పనులు చేసుకునే లక్ష్మి దేవి కి నాలుగేళ్ల క్రితం క్యాన్సర్ సోకింది. గ్రామస్తుల సహకారం తో వైద్యం చేయించుకున్నా ఫలితం దక్కలేదు. ఇంట్లో నుండి బయటకు వెళ్లలేని స్థితిలో చుట్టుపక్కల వారు పెట్టే భోజనం తింటూ కాలం గడిపేది. లాక్ డౌన్ నేపథ్యంలో ఎవరూ బయటకు రాలేని పరిస్థితి. ఈ నేపథ్యంలో గురువారం ఇంటి నుండి దుర్గంధం వస్తుండటంతో స్థానికులు పంచాయతీ కార్యదర్శి కి, పోలీసులకు సమాచారమిచ్చారు. పోలీసులు, పంచాయతీ సిబ్బంది వెళ్లి తలుపులు తీసి చూడగా లక్ష్మీదేవి చనిపోయి ఉంది. మృతదేహం నుండి దుర్వాసన వస్తుండటంతో గ్రామస్తులెవరూ దగ్గరకు రాలేదు. దీంతో ఎస్.ఐ హేమాద్రి, హెడ్ కానిస్టేబుల్ గంగరాజు, పంచాయతీ కార్యదర్శి రవీంద్రారెడ్డి, గ్రామ రెవిన్యూ అధికారి శ్రీను నాయక్ ల సమక్షంలో పంచనామా నిర్వహించి, వాలంటీర్ ల సహకారం తో వృద్ధురాలి మృతదేహానికి అంతిమసంస్కారం నిర్వహించి మానవత ను చాటుకున్నారు. కాగా
అనాధ వృద్ధురాలి మృతదేహానికి అంతిమ సంస్కారం నిర్వహించి మానవత్వం చాటుకున్న ఎస్.ఐ హేమాద్రి, హెడ్ కానిస్టేబుల్ గంగరాజు ల ను జిల్లా ఎస్.పి కే.కే.ఎన్ అన్బురాజన్ ఐ.పి.ఎస్ అభినందించారు. పోలీస్ శాఖ ఔన్నత్యాన్ని పెంపొందించారన్నారు.
0 Comments