జంతువుల నుంచి వచ్చిందేప్రయోగశాలలో తయారు చేసింది కాదు: డబ్ల్యూహెచ్‌వో

జెనీవా: ప్రపంచ దేశ ప్రజలను  అతలాకుతలం చేస్తున్న కరోనా వైరస్‌ చైనాలో గత ఏడాది చివర్లో జంతువుల నుంచి ఉద్భవించినట్లు కనిపిస్తోందని ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌వో) పేర్కొంది. అందుబాటులో ఉన్న అన్ని సాక్ష్యాధారాలూ ఇదే విషయాన్ని సూచిస్తున్నాయని తెలిపింది. ప్రయోగశాలలో వైరస్‌ను ఉత్పత్తి చేశారన్న వాదనలో వాస్తవం లేదని పేర్కొన్నారు . డబ్ల్యూహెచ్‌వో అధికార ప్రతినిధి ఫదేలా చైబ్‌ జెనీవాలో మంగళవారం విలేకర్ల సమావేశంలో ఈ మేరకు వివరాలను వెల్లడించారు. జంతువుల నుంచి మనుషుల్లోకి వైరస్‌ ఎలా ప్రవేశించిందనేదానిపై మాత్రం ప్రస్తుతానికి స్పష్టత లేదన్నారు. గబ్బిలాల నుంచి అది మానవుల్లోకి చేరి ఉండొచ్చని అభిప్రాయపడ్డారు.

Post a Comment

0 Comments