చింతపల్లి(షేక్ కాశిమ్ వలీ): చింతపల్లి పంచాయతీ పరిధిలో 500 నిరుపేద కుటుంబాలకు పట్టణ కేంద్రం ఝాన్సీ టెంట్ హౌస్ యజమాని ఆనంద్ దంపతులు పంపిణీ చేశారు. కరోనా వైరస్ వల్ల లాక్ డౌన్,144 సెక్షన్ల అమలులో ఉండటం వల్ల ప్రజలకు కూలి పనులు లేకుండా పోయాయి. హాల్లో తినటానికి నిత్యావసర సరుకులు కూడా లేక నిరుపేద ప్రజలు తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. ఈ నేపథ్యంలో పంచాయతీ పరిధిలో ఉన్న నిరుపేదలకు తన వంతు సహాయం చేయాలని ఝాన్సీ టెంట్ హౌస్ యజమాని ఆనంద్ దంపతులు ముందుకొచ్చారు. సోమవారం ఆనంద్ కుటుంబ సభ్యులు సాయినగర్, సాడీపేట,ఎస్సి కాలనీ, చిన్నగెడ్డ, గడపరాయి, కందులగాదె, మల్లవరం తదితర గ్రామాల్లో సుమారు 500 కుటుంబాలకు నిత్యావసర సరుకులు ( బియ్యం, కూరగాయలు) పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆనంద్ మాట్లాడుతూ ప్రస్తుత కష్టకాలంలో నిరుపేదలకు తన వంతు సహాయం చేయాలని నిత్యావసర సరుకులు పంపిణీ చేస్తున్నామని చెప్పారు. మంగళవారం కూడా మరో ఐదు వందల కుటుంబాలకు నిత్యావసర సరుకులు పంపిణీ చేసేందుకు ఏర్పాట్లు చేసుకున్నారని ఆయన తెలిపారు. ఆనందరావు సేవలు అందుకున్న ప్రజలు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.
0 Comments