చింతపల్లి(అన్వేషణ అప్ డేట్):
ప్రాంతీయ భక్తులు ప్రతిష్టాత్మకంగా జరుపుకునే చింతపల్లి ముత్యాలమ్మ జాతర కరోనా వైరస్ కారణంగా ఈ ఏడాది నిర్వహించే అవకాశం కలగలేదు. అయితే ప్రతియేటా గంధమా వాస్య నాడు అమ్మవారికి భక్తులు పసుపు కుంకుమ అర్పించి పూజలు నిర్వహించడం ఆనవాయితీగా వస్తోంది. లాక్ డౌన్ అమలులో ఉండటం వల్ల పూజలు నిర్వహించేందుకు ఆలయానికి భక్తులు ఎవరు రావద్దని పూజారి సుర్ల అప్పారావు, ఏ ఎస్ పి సతీష్ కుమార్ స్పష్టం చేశారు. ఈ నేపథ్యంలో వేకువజామునే ఒకరిద్దరు భక్తులు మాస్కులు ధరించి, సామాజిక దూరం పాటిస్తూ పూజలు నిర్వహించి వెళ్ళిపోయారు. అలాగే బుధవారం ఉదయం నిరాడంబరంగా అతి తక్కువ మంది భక్తులు అమ్మవారికి పూజలు నిర్వహించారు.ప్రస్తుతం ఒకరు ఇద్దరు భక్తులు ఆలయం చుట్టూ ప్రదక్షిణలు చేసి అమ్మవారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకుని వెళ్ళిపోతున్నారు. ప్రతియేటా భక్తులతో కిటకిటలాడే ఆలయం ప్రస్తుతం తొలిసారి నిర్మానుష్యంగా దర్శనమిస్తుంది. ఇది ఇలా ఉండగా రాత్రి 7 గంటలకు సుర్ల వారి గృహంలో ప్రత్యేక పూజలు నిర్వహించి కేవలం ముగ్గురు వ్యక్తులు మాత్రమే అమ్మవారి పాదాలను ఆలయం వద్దకు తీసుకొని వచ్చి పసుపు కుంకుమ సమర్పిస్తారని ఎటువంటి ఊరేగింపు ఉండదని పూజారి సూర్య అప్పారావు తెలిపారు.
0 Comments