నిరుపేద గిరిజన కుటుంబాలకు ఆపన్న హస్తం.ఐదు రకాల నిత్యావసర సరుకుల వితరణ.అన్నవరం మాజీ సర్పంచ్ నాగజ్యోతి

చింతపల్లి(షేక్ కాశిమ్ వలీ): లాక్ డౌన్ కారణంగా పలు  ఇబ్బందులను ఎదుర్కొంటున్న గిరిజనులకు  అన్నవరం గ్రామానికి చెందిన తెదేపా, వైకాపా, డ్వాక్రా మహిళలు నిత్యావసర సరుకులు అందించి తమ ఉధారతను చాటుకున్నారు. అన్నవరం పంచాయతీ పరిధిలోని పదమూడు గిరిజన గ్రామాల్లో సుమారు రెండు వందల ఆదివాసీ గిరిజన కుటుంబాలకు ఐదు రకాల నిత్యావసర సరుకులను వితరణగా అందించారు. స్థానిక యస్ఐ ప్రశాంత్ సూచన మేరకు భౌతిక దూరం పాటిస్తూ సరుకులు అందజేయడం జరిగిందని ఆ పంచాయతీ తాజా మాజీ సర్పంచ్ సుండ్రు నాగజ్యోతి తెలిపారు. ఈ కార్యక్రమంలో తెదేపా, వైకాపా నాయకులు గంగరాజు, చిన్నబ్బాయి, సేవా. లీలావతి, అరకు.లక్ష్మీ తదితరులు పాల్గొన్నారు. 


Post a Comment

0 Comments