చింతపల్లి ముత్యాలమ్మ జాతరకు కరోనా వైరస్ ఎఫెక్ట్.. నాటి జ్ఞాపకాలను ఒకసారి నెమరు వేసుకుందాం..

ఈ వ్యాసం నచ్చితే ప్రతి ఒక్కరు షేర్ చెయ్యండి కామెంట్ బాక్స్ లో కామెంట్ చెయ్యండి  

ప్రాంతీయ భక్తులు ప్రతీ ఏట ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న చింతపల్లి ముత్యాలమ్మ అమ్మవారి జాతరకు కరోనా వైరస్ ఎఫెక్ట్ తగిలింది. లాక్ డౌన్ అమలులో ఉండడం వల్ల జాతర జరుపుకో లేని పరిస్థితి ఏర్పడింది.  ముత్యాలమ్మ అమ్మవారి జాతర ప్రతి ఏటా  నాలుగు రోజులపాటు స్థానిక ఎమ్మెల్యే ఆధ్వర్యం  ఘనంగా నిర్వహించడం ఆనవాయితీగా వస్తుంది. గత ఏడాది టిడిపి ఎమ్మెల్యే  గిడి ఈశ్వరి ఆధ్వర్యంలో జాతర ఘనంగా నిర్వహించారు. ఈ ఏడాది నూతనంగా ఎంపికైన పాడేరు ఎమ్మెల్యే కొట్టగుళ్లి భాగ్యలక్ష్మి అధ్వర్యం లో జాతర నిర్వహించాల్సి వుంది. అయితే మర్చి లోనే జాతర నిర్వహణ పై సమావేశం నిర్వహించాలని ఎమ్మెల్యే వర్గం సభ్యులు భావించినప్పటికీ పరిస్థితులు అనుకూలించక వాయిదాపడింది. ఆ తరువాత కరోనా వైరస్ కారణంగా ఈ ప్రస్తావన రాలేదు. ప్రస్తుతం లాక్ డౌన్ నిబంధనలు కఠినంగా అమలు పరుస్తున్న నేపథ్యంలో ఈ ఏడాది కనీసం ఆలయం ఐదుగురు కలిసి పూజలు కూడా చేసేపరిస్థితి కనిపించడం లేదు.  
                              తొలిరోజు అన్నదానం లో పాల్గొన్న మాజీ మంత్రి బాలరాజు 

అన్ని అనుకూలించివుంటే.. 
అన్ని అనుకూలించివుంటే ఆదివారం(ఏప్రిల్ 19)న ముత్యాలమ్మ జాతర ప్రారంభమై ఉండేది. చింతపల్లి ముత్యాలమ్మ అమ్మవారి దర్శనం చేసుకుంటే కోరికలు నెరవేరుతాయని భక్తుల బలమైన నమ్మకం. అమ్మవారి జాతరలో పాల్గొనేందుకు సుమారు ప్రతి ఏటా 
రెండు లక్షలకు పైగా భక్తులు వస్తుంటారు.  ప్రతి ఏటా  గంధమావాస్యకు నాలుగు రోజులు ముందు ప్రారంభించి అమావాస్యతో ముగిస్తారు. సుమారు 100 ఏళ్లకు పైగా స్థానికులు అమ్మవారి ఉత్సవాలను నిర్వహిస్తున్నారు . తొలిరోజుల్లో మూడు రోజుల పాటు నిర్వహించే ఉత్సవాలను పదేళ్లుగా  నాలుగు రోజులు నిర్వహిస్తున్నారు. కాగా ఈ ఏడాది గంధమావాస్య 22న వచ్చింది. నాలుగు  రోజులు జాతర నిర్వహిస్తే ఆదివారం, మూడురోజులు నిర్వహిస్తే సోమవారం జాతర ప్రారంభమైయేది. అయితే కరోనా వైరస్ కారణంగా ఎక్కడా అమ్మవారి జాతర ప్రస్తావన కనిపించడం లేదు. కొంతమంది గంధమావాస్యరోజైనా అమ్మవారికి పసుపుకుంకుమలు సమర్పిచి నిరాడంబరంగా అమ్మవారి పూజలు నిర్వహిచాలని భావిస్తున్నప్పటికీ పోలీసులనుంచి అనుమతి వచ్చే అవకాశం కనిపించడం లేదు.
 గరగాలను శిరస్సుపై ఎత్తుకొని ఊరేగింపులో పాల్గొన్న నాటి ఎమ్మెలే  గిడ్డి ఈశ్వరి, జడ్పీటీసీలు పద్మ కుమారి , గంటా నళిని, సర్పంచ్ సాగిన దేవుడమ్మ, పూజారి సుర్ల అప్పారావు, వర్తక సంఘం ప్రధాన కార్యదర్శి పేదిరెడ్ల బేతాళుడు..

గత ఏడాది సంబరం ఎలాజరిగిందో ఒకసారి గుర్తు చేసుకుందాం.. 
గత ఏడాది  పాడేరు ఎమ్మెల్యో గిడ్డి ఈశ్వరి ఆధ్వర్యం లో అమ్మవారి జాతర జరిగింది. గత ఏడాది గంధమావాస్య మే 4న వచ్చింది. దింతో జాతర మే ఒకటైన ప్రారంభమైంది. అయితే మాజీ మంత్రి పసుపులేటి బాలరాజు దంపతులు ఆధ్వర్యం లో జరిగే మే  ఒకటి నూతన ముత్యాలమ్మ అమ్మవారి వార్షికోత్సవం కూడా  కలసి వచ్చింది. తొలిరోజు ఆలయంలో మాజీ మంత్రి, ఆయన సోదరుడు వార్డెన్ వినాయక రావు,  డాక్టర్ లక్మణరావు సహకారంతో ఆలయం లో అన్నదానం, ప్రత్యక డాన్స్ బేబీ  డాన్స్ కార్యక్రమం నిర్వహించారు. అంతరం జాతరలో భాగంగా ప్రతిరోజూ ఆలయంలో పూజాకార్యక్రమాలు ఘనంగా జరిగాయి. పలు వీధులనుంచి  భక్తులు సారిని తీసుకొచ్చి అమ్మవారికి సమర్పించారు. వేదిక - 1 ( జెడ్పీ హైస్కూల్ ) లో గురువారం డ్యాన్స్ బేబీ డ్యాన్స్ , శుక్రవారం డ్యాన్స్ మస్తీ ,ఆదివారం డ్యాన్స్ హంగామ , వేదిక - 2 ( సబ్ జైలు ) గురువారం డ్యాన్స్ బేబీ డ్యాన్స్ , శుక్రవారం కలియు చింతామణి నాటకం ,శనివారం కపుల్ డ్యాన్స్ హంగామ ప్రదర్శనలు జరిగాయి. 
సంబరం జరిగింది ఇలా .. 
 అమ్మవారి ఉత్సవం అంగరంగ వైభవంగా జరిగింది.  గురువారం ఆలయంలో సాధారణ పూజలు , సాయంత్రం అమ్మవారి గరగలు ( పాదాలు ) సుర్లవారి వంశీయుల స్థావరాల నుంచి గిరిజన సాంప్రదాయ నృత్యవాయిధ్యాలతో భారీ ఊరేగింపు నడుమ శతకంపట్టు వద్దకు తీసుకొచ్చారు. అమ్మవారి గరగలకు శతకంపట్టు వద్ద ప్రత్యేక పూజకార్యక్రమాలు నిర్వహించి శుక్రవారం సాయంత్రం చింతపల్లి పురవీధుల్లో ఊరేగింపు ప్రారంభించి శనివారం ఉదయం ఆరుగంటల వరకు పట్టణంలో ఊరేగించి గరగలను అమ్మవారి ఆలయానికి తీసుకొచ్చారు. అదే రోజు మధ్యాహ్నం పాడేరు ఎమ్మెల్యే గిడ్డి ఈశ్వరి , స్థానిక పెద్దలు అనుపోత్సవంలో భాగంగా అమ్మవారి గరగలను(పాదాలు ) దూపనైవేద్యాలతో పూజా కార్యక్రమాలు నిర్వహించి భారీ ఊరేగింపు నడుమ సాయంత్రం సుర్ల వంశీయుల స్థావరాలకు తరలించి సంబరాన్ని  ముగించారు. జాతరలో జెయింట్ వీల్, సర్కస్ సందడి, పాలురకాల దుకాణాలు వేల సంఖ్యలో భక్తులతో జాతర జరిగింది.
ఆరెంజ్ ఆర్మీ కోసం చెప్పుకోకపోతే ఎలా ..?
ముత్యాలమ్మ ఉత్సవ కమిటీ వలెంటీర్లు(ఆరెంజ్ ఆర్మీ) సేవలు  అభినందనీయమని చింతపల్లి ఏఎస్పీ ఎస్ . సతీష్ కుమార్ స్వయంగా ప్రశంసించారంటే జాతర వియవంతానికి ఏ  స్థాయిలో సేవలందించారో ప్రత్యేకంగా చెప్పనక్కర లేదు.  జాతర ముగింపు రోజు ముత్యాలమ్మ ఆలయంలో ఉత్సవ కమిటీ నాయకులు, వలెంటీర్లతో ఏఎస్పీ సమావేశమయ్యారు. ఏఎస్పీ మాట్లాడుతూ ఉత్సవ కమిటీ వలెంటీర్లు బాధ్యతాయుతంగా పనిచెయ్యడం వల్ల పోలీసులకు కొంత శ్రమ తగ్గిందని చెప్పారు . సాయంత్రం నుంచి తెల్లవారు నాలుగు గంటల వరకు పట్టణం రహదారులు భక్తులతో నిండి ఉంటుందని , ఈ సమయంలో పోలీసులతో పాటూ ఉత్సవ కమిటీ వలెంటీర్లు కూడా ట్రాఫిక్ నియంత్రించడంతోపాటూ ఎక్కడా అల్లర్లు చోటుచేసుకోకుండగా జాగ్రత్తలు తీసుకున్నారని ప్రశంసించారు.  అధికారుల సూచనమేరకు వలెంటీర్లు(ఆరెంజ్ ఆర్మీ) డ్రస్ కోడ్ , ఐడీకార్డుల ను ధరించి విజయవంతానికి కృషిచేశారు. అప్పుడు వలంటీర్లు , ఉత్సవకమిటీ, వలెంటీర్లతో   ఉపాధ్యాయులు యువి గిరి, గసాడి పద్మనాభం ఏర్పాటు చేసిన ముత్యాలమ్మ తల్లి జాతర (ప్రస్తుతం ఆరెంజ్ ఆర్మీ)వాట్సాప్ గ్రూప్ ఇప్పటికి  నడుస్తుంది. ఉత్సవ కమిటీ , వాలంటీర్లను ఏ ఎస్పీ సన్మానించగా , ఏ ఎస్పీ ని ఉత్సవ కమిటీ సన్మానించింది. జాతర విజవంతానికి ఏ  ఎస్పీ సతీష్ కుమార్, సిఐ శ్రీధర్, ఎస్ ఐ రమేష్, పోలీస్ లు చేసిన కృషి చాల గొప్పదని చెప్పక తప్పదు.  
క్రీడల్లో గెలుపొందిన క్రీడాకారులకు నగదు బహుమతి అందజేస్తున్న మాజీ ఎమ్మెల్యే ఈశ్వరి 
ద్వితీయ బహుమతిని అందజేస్తున్న పాడేరు ఎమ్మెల్యే కొట్టగుళ్లి భాగ్యలక్ష్మి 


ఉత్సవ కమిటీ అధ్యక్షుడు , ప్రధాన కార్యదర్శి , నాయకులుగా  గెమ్మెలి మోహన్ రావు , తిరుపతిరావు , తాటిపాకల నగేష్ , పెదిరెడ్ల బేతాళుడు , జోగేశ్వరరావు , బంగారయ్య శెట్టి , తాడి నూకరాజు , గసాది పద్మనాభం , యూవీగిరి , రహ్మాన్ , గింజారి రమణ, కుడుములు రమణ వ్యహరించారు. ముత్యాలమ్మ జాతర ఈ ఏడాది జరగకపోయినా నాటి జ్ఞాపకాలను నెమరువేసుకొంటూ భక్తులు ఆనందించాలని అన్వేషణ అప్ డేట్ వెబ్ న్యూస్ ఈ ప్రయత్నం చేసింది. 

వ్యాసకర్త: విఎస్ జె ఆనంద్. 

Post a Comment

0 Comments