నర్సీపట్నం(విఎస్ జె ఆనంద్):
ఢిల్లీ మత ప్రార్థనలకు వెళ్లి నర్సీపట్నం వచ్చిన పది మంది వ్యక్తుల్లో మరొకరికి కరోనా వైరస్ పాజిటివ్ వచ్చినట్టు నర్సీపట్నం ఆర్డీవో కేఎల్ శివజ్యోతి తెలిపారు. వివరాల్లోకి వెళితే.. ఢిల్లీ మత ప్రార్థనల్లో పాల్గొన్న తమిళనాడుకు చెందిన పది మంది వ్యక్తులు మార్చి 19న నర్సీపట్నం వచ్చారు. నిజాముద్దీన్ మత ప్రార్థనలో పాల్గొన్న ఈ పది మందిని నర్సీపట్నం అధికారులు, స్థానిక ఆర్డీవో, ఏఎస్పీ , జిల్లా ఎస్పీ సకాలంలో గుర్తించి వెనువెంటనే విశాఖపట్నం తరలించి కరోనా వైరస్ పరీక్షలు నిర్వహించగా ఇద్దరికి పాజిటివ్ వచ్చింది. నెగిటివ్ రిపోర్ట్ వచ్చిన మరో ఎనిమిది మందిని షీలా నగర్ క్వారంటేయిన్ కి తరలించారు. ఆదివారం ఈ ఎనిమిది మందిని పరీక్షించగా ఒక మహిళకు పాజిటివ్ వచ్చినట్టు ఆర్డీవో తెలిపారు. తొలుత పాజిటివ్ వచ్చిన ఇద్దరికి చికిత్స అందించగా రెండు రోజుల కిందట నిర్వహించిన పరీక్షలో నెగిటివ్ వచ్చిన విషయం పాఠకులకు తెలిసిందే. అయితే షీలానగర్ క్వారంటేయిన్ లోనున్న ఎనిమిది మందిలో మరో మహిళకు కరోనా వైరస్ పాజిటివ్ రావడంతో స్థానికులు ఆందోళన చెందుతున్నారు. ఇది ఇలా ఉండగా ఢిల్లీ మత ప్రార్థనల్లో పాల్గొని నర్సీపట్నం వచ్చిన పదిమందిలో ఇప్పటివరకు ముగ్గురికి కరోనా వైరస్ పాజిటివ్ లు రావడంతో కంటెయిన్మెంట్ జోన్ గా ప్రకటించిన నర్సీపట్నం 23 ,24 ,25 వార్డులో కట్టుదిట్టమైన లాక్ డౌన్ నిబంధనను అమలు పరిచేందుకు అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. కాగా తాజాగా మరో పాజిటివ్ కేసునమోదు కావడంతో విశాఖపట్నం జిల్లా లో కేరళ కేసుల సంఖ్య 21 చేరింది.
0 Comments