చింతపల్లి ఏప్రిల్12 (షేక్ కాశిమ్ వలీ): ప్రజాశ్రేయస్సు కోసం అనునిత్యం కష్టపడి పనిచేసే వ్యవస్థ పాత్రికేయమని చింతపల్లి ఎంపీడీవో ఎస్. ప్రేమాకరరావు అన్నారు. ఆదివారం మండల పరిషత్ కార్యాలయంలో పెదబరడ గ్రామానికి చెందిన గిరిజన యువకుడు ,

విజేవి గ్రీన్ హౌస్ యజమాని వనుము సాయికృష్ణ వ్యక్తిగత నిధులతో సమకూర్చిన ఫైండ్ రైస్ ని ఒక్కొక్కరికి ఐదుకిలోల ప్యాకెట్లను ఎంపీడీవో చేతులమీదుగా పాత్రికేయులకు అందజేశారు. ఈ సంధర్భంగా ఎంపీడీవో మాట్లాడుతూ లాక్ డౌన్ సమయంలో ప్రజలెదుర్కొంటున్న సమస్యలను వెలుగులోకి తీసుకువచ్చి పరిష్కరించేందుకు కృషి చేస్తున్నారన్నారు. ప్రభుత్వాలను, అధికారులను, ప్రజలను అప్రమత్తం చేయడంలో ప్రాణాలకు తెగించి పాత్రికేయులు అందిస్తున్న సేవలు ప్రసంసనీయమని కొనియాడారు. ఈ కార్యక్రమంలో ఈవోపీఆర్డీ శ్రీనివాస్, పాత్రికేయులు పాల్గొన్నారు.
0 Comments