స్థానిక ఎస్ పి ఎస్ సతీష్ కుమార్ చొరవతో తాజంగి రేషన్ దుకాణాల్లో లబ్ధిదారులు భౌతిక దూరం పాటిస్తూ సరుకులను తీసుకుంటున్నారు. ఆదివారం ఉదయం ఒకేసారి ఏడు గ్రామాల నుంచి ఉచిత సరుకులు తీసుకునేందుకు లబ్ధిదారులు తాజంగి జి సి సి డిపో వద్దకు వచ్చారు. దీంతో సరుకులు తీసుకునేందుకు లబ్ధిదారులు ఒకరినొకరు తోసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఈ విషయాన్ని అన్వేషణ అప్ డేట్ ద్వారా తెలుసుకున్న ఏఎస్పీ ఎస్సై అహ్మద్ అలీ ని తాజంగి పంపించారు. లబ్ధిదారులు అందరూ క్రమంగా భౌతిక దూరం పాటిస్తూ సరుకులు తీసుకునే విధంగా ఎస్ఐ ఏర్పాట్లు చేశారు. ప్రస్తుతం తోపులాట లేకుండా క్యూ పద్ధతిలో వినియోగదారులు సరుకులను తీసుకుంటున్నారు.
0 Comments