శానిటైజర్‌తో సారా తయారీ

అనంతపురం: లాక్‌డౌన్‌ అమల్లో ఉండడం, మద్యం అందుబాటులో లేకపోవడంతో ఓ మెడికల్‌ రిప్రజెంటేటివ్‌ మరో ముగ్గురితో కలసి శానిటైజర్‌తో సారా తయారీ చేపట్టాడు. ఈ సారాను మంగళవారం ఆబ్కారీశాఖ అధికారులకు పట్టుబడ్డారు. అనంతపురం ఆబ్కారీశాఖ కార్యాలయంలో ఉప కమిషనర్‌ విజయశేఖర్‌ విలేకరుల సమావేశంలో తెలిపిన వివరాల మేరకు..కమలానగర్‌లోని రఘువీరా కాంప్లెక్స్‌ ప్రాంతంలో నలుగురు కల్తీ సారా విక్రయిస్తున్నారని తెలుసుకున్నారు. ఆ శాఖ సహాయ కమిషనర్‌ నాగేశ్వరరెడ్డి, సీఐలు అన్నపూర్ణ, అశోక్‌రెడ్డి ప్రత్యేక బృందంగా ఏర్పడి అక్కడికి వెళ్లారు. ఓ వ్యక్తిని సారా కొనేందుకు పంపారు. సదరు వ్యక్తి కొనుగోలు చేస్తుండగా అధికారుల బృందం నిందితులు విశ్వనాథరెడ్డి, లాల్‌బాషా, గోపి, అశోక్‌లను అరెస్టు చేశారు. నిందితుల నుంచి 18 శానిటైజర్ల సీసాలు, సారా స్వాధీనం చేసుకున్నారు.

Post a Comment

0 Comments