చెరపల్లిలో ఓ గిరిజనుడు గృహంపై కూలిన భారీ వృక్షం.. కుటుంబ సభ్యులు గృహంలో లేకపోవడం వల్ల తప్పిన పెను ప్రమాదం

చింతపల్లి(షేక్ కాశిమ్ వలీ): మండలంలోని చెరపల్లి  గ్రామంలో ఓ గిరిజనుడు గృహంపై భారీ వృక్షం, విద్యుత్ స్తంభం ఒకదాని వెంట ఒకటి కూలి పడింది. అయితే ఆ సమయంలో కుటుంబ సభ్యులు ఎవరు గృహంలోనే లేకపోవడం, విద్యుత్ సరఫరా నిలిచి పోవడం వల్ల పెను ప్రమాదం తప్పింది. బాధితుల కథనం ప్రకారం ఏజెన్సీ వ్యాప్తంగా రెండు రోజులుగా వర్షాలు కురుస్తున్నాయి. సోమవారం మధ్యాహ్నం  లోతుగెడ్డ పంచాయతీ చెరపల్లి గ్రామంలో తోట సన్యాసయ్య కుటుంబ సభ్యులతో గృహంలో టీవీ చూస్తున్నారు. సుమారు 12 గంటలకు విద్యుత్ సరఫరా నిలిచిపోవడంతో కుటుంబ సభ్యులు గృహం నుంచి బయటకు వచ్చి పొరిగింటి కి వెళ్లారు. అదే సమయంలో చింత చెట్టు వేర్లతో సన్యాసయ్య గృహంపై కూలి పడింది. చింత చెట్టు పక్కనే 11 కె.వి విద్యుత్ లైన్ ఉండడంవల్ల విద్యుత్ స్తంభం కూడా గృహం పై పడింది. సమయానికి గృహంలో ఎవరూ లేకపోవడం, విద్యుత్ సరఫరా కూడా లేకపోవడం వల్ల ఎవరికీ ఎటువంటి ప్రాణ హాని కలగలేదు. అయితే బాధిత కుటుంబ సభ్యులను ప్రభుత్వం ఆదుకోవాలని వారు విజ్ఞప్తి చేస్తున్నారు.  

Post a Comment

0 Comments