లాక్ డౌన్ లో చిక్కుకున్న బీహార్, మహారాష్ట్ర వ్యాపారులకు జిల్లా కలెక్టర్ పంపించిననిత్యావసర సరుకులు పంపిణీ..ఎంపీడీవో ప్రేమాకర రావు ,డిటి తిరుమలరావు

చింతపల్లి: 
బీహార్, మహారాష్ట్ర ప్రాంతాల నుంచి వ్యాపారం కోసం చింతపల్లి వచ్చి లాక్ డౌన్  లో చిక్కుకున్న కుటుంబాలకు జిల్లా కలెక్టర్ పంపించిన నిత్యావసర సరుకుల కిట్లను  పంపిణీ చేసినట్లు ఎంపీడీవో ప్రేమాకర రావు,  డిటి తిరుమల రావు తెలిపారు. బుధవారం ఆయన స్థానిక విలేకరులతో మాట్లాడుతూ..వ్యాపార నిమిత్తం బీహార్, మహారాష్ట్ర ప్రాంతాల నుంచి 17మంది చింతపల్లి కి మూడు నెలల కిందట వచ్చారన్నారు. ప్రస్తుతం వారి స్వగ్రామాలకు వెళ్లలేని పరిస్థితిలో ఇక్కడే ఉంటున్నారన్నారు. దీంతో గతంలోనూ వారికి నిత్యావసర సరుకులు అందజేశామని, ప్రస్తుతం స్థానిక రెవెన్యూ కార్యాలయంలో జిల్లా కలెక్టర్ పంపించిన 10 కిలోల బియ్యం, 3 కిలోల గోధుమపిండి, కిలో ఆయిల్, కిలో పప్పు కలిగిన కిట్లను 17 మందికి పంపిణీ చేసినట్టు తెలిపారు.  కార్యక్రమంలో ఆర్ ఐ బాలన్న దొర పాల్గొన్నారు.

Post a Comment

0 Comments