తాజంగి రేషన్ దుకాణం (జీసీసీ డి ఆర్ డిపో ) వద్ద వినియోగదారులు భౌతిక దూరం పాటించే విధంగా ఎంపీడీవో ప్రేమాకర రావు ఏర్పాట్లు చేశారు. ఆదివారం ఒకేసారి ఉచిత సరుకుల కోసం అధిక సంఖ్యలో లబ్ధిదారులు రావడం వల్ల ఒకరినొకరు తోసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. దీంతో రెండు గంటల క్రితం అన్వేషణ అప్ డేట్ రేషన్ దుకాణం వద్ద పరిస్థితిని వివరిస్తూ ఫోటోలతో ప్రచురించిన వార్తాకథనాన్ని కి స్పందించిన ఎంపీడీవో , ఎస్సై మహ్మద్ అలీ హుటాహుటిన తాజంగి చేరుకున్నారు.
గ్రామ సచివాలయ ఉద్యోగులు, గ్రామ వలంటీర్ల సహకారంతో లబ్ధిదారులు భౌతిక దూరం పాటించే విధంగా పరిస్థితిని చక్కదిద్దారు. ప్రతి కుటుంబానికి ఉచిత సరుకులు అందేవరకు రేషన్ దుకాణం తెరిచి ఉంటుందని లబ్ధిదారులకు ఎంపీడీవో వివరించారు. ఏ ఒక్కరు సరుకుల కోసం ఆందోళన చెందాల్సిన అవసరం లేదని ప్రతి కుటుంబానికి అందించేందుకు ఏర్పాట్లు చేశామని అవసరమైన నిల్వలు కూడా ఉన్నాయని ఆయన చెప్పారు. దీంతో వినియోగదారులు భౌతిక దూరం పాటిస్తూ క్యూలైన్లో నిల్చొని సరుకులను తీసుకునేందుకు సహకరిస్తున్నారు .
0 Comments