ముంబైలో 53 మంది జర్నలిస్టులకుకరోనా పాజిటివ్

ముంబై: ప్రజల సమస్యలను పాలకుల దృష్టికి తీసుకుని వెళ్లేందుకు నిర్విరామంగా శ్రమిస్తున్న  పాత్రికేయుల మీద కరోనా వైరస్ పడగ విప్పింది. ముంబైలో సోమవారం పాత్రికేయులకు పరీక్షలు నిర్వహించగా 53 మందికి కరోనా వైరస్  పాజిటివ్ అని తేలింది. అయితే చిత్రం ఏమిటంటే పాజిటివ్ వచ్చిన జర్నలిస్టు లో ఏ ఒక్కరికి కూడా వైరస్  లక్షణాలు లేవు.  దీంతో జర్నలిస్టులు కూడా ఆందోళన చెందుతున్నారు.   ముంబై కార్పోరేషన్ జరిపిన పరీక్షలకు 170 మంది పాత్రికేయులు హాజరయ్యారు. ఇందులో కెమెరామేన్, ఫోటోగ్రాఫర్లు కూడా
ఉన్నారు. ఈ నిర్ధారణ పరీక్షలలో కరోనా ఉన్నట్లు తేలడంలో జర్నలిస్టులు భయాందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇక చెన్నైలోనూ ముగ్గురు జర్నలిస్టులకు కరోనా పాజిటివ్ వచ్చినట్లుగా సమాచారం . తాజా  పరిణామాల నేపథ్యంలో పాత్రికేయులు విధి నిర్వహణలో
 అప్రమత్తంగా వ్యవహరించాలని  వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు.  

Post a Comment

0 Comments