ప్రభుత్వ పథకాలను ప్రజలకు చేరవేసేందుకు విశిష్ట కృషి చేస్తున్న గ్రామ వలంటీర్లకు రూ.50 లక్షల బీమాసదుపాయం కల్పించిన ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నట్లు అరకు పార్లమెంట్ వైసీపీ జిల్లా ప్రధాన కార్యదర్శి కూడా సురేష్ కుమార్ తెలిపారు. మంగళవారం అన్వేషణ అప్డేట్ తో ఆయన మాట్లాడుతూ ..గ్రామ వలంటీర్ లను "ప్రధానమంత్రి గరీబ్ కళ్యాణ్" పరిధిలో చేర్చి బీమా సదుపాయం ముఖ్యమంత్రి కల్పించారన్నారు. ప్రస్తుత లాక్ డౌన్ కాలంలోనూ ప్రాణాలకు తెగించి కేవలం గౌరవ వేతనం తీసుకుంటూ సేవలందిస్తున్న గ్రామ వలంటీర్లకు ఇది ఒక సువర్ణ అవకాశం అని ఆయన అన్నారు.
0 Comments