పాత్రికేయులను భయపడుతున్న కరోనా..తమిళనాడులో 40 మందిజర్నలిస్టులకు కరోనా పాజిటివ్

చెన్నై: పాత్రికేయులను కరోనా వైరస్ భయపడుతుంది. లాక్ డౌన్ కాలంలో ప్రజలకు తాజా సమాచారం ప్రజలకు  చేరవేస్తూ గృహాలను విడిచి బయటకు వెళ్ళి వార్తలను సేకరిస్తున్న పాత్రికేయుల పరిస్థితి దయనీయంగా మారింది. ఇప్పటికే ముంబైలో 53 మంది
జర్నలిస్టులు కరోనా పాజిటివ్ కేసులతో ఆసుపత్రులలో
చేరగా, ఇప్పుడు తాజాగా తమిళనాడులో 40 మంది పాత్రికేయులకు కరోనా సోకింది. ఈ మేరకు పత్రికా లోకం ఆందోళన చెందుతుంది. విధి నిర్వహణలో ఉన్న పోలీసులు, డాక్టర్లు వైరస్ బారిన పడుతున్నారు. తాజాగా పాత్రికేయులు కూడా కరోనా కోరల్లో చిక్కుకుంటున్నారు. కాగా, తమిళనాడు
లోని ఓ టీవీ ఛానల్లో పనిచేస్తున్న ముప్పయి మందికి
కరోనా సోకడంతో అక్కడ అంతా అప్రమత్తం చేశారు.
ఇదిలా ఉండగా, పాత్రికేయులు జాగ్రత్తగా ఉండాలని,
తమ విధులను నిర్వహించే విషయంలో పూర్తి
జాగ్రత్తలు తీసుకోవాలని వైద్యులు సూచిస్తున్నారు.

Post a Comment

0 Comments