నర్సీపట్నం(విఎస్ జె ఆనంద్):
తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు, ఏపీ మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు జన్మదినం పురస్కరించుకొని స్థానిక మున్సిపల్ పారిశుద్ధ్య కార్మికులకు నర్సీపట్నం 28 వార్డుల టిడిపి కౌన్సిలర్ అభ్యర్థులు బియ్యం, నిత్యావసర సరుకులను కమిషనర్ కృష్ణవేణి చేతులమీదుగా పంపిణీ చేశారు. వివరాల్లోకి వెళితే..సోమవారం చంద్రబాబు నాయుడు జన్మదినం సందర్భంగా తెలుగు యువత జిల్లాఉపాధ్యక్షులు, నర్సీపట్నం సిబిఎన్ ఆర్మీ ఇంచార్జ్ వెంకటేశ్వర్లు దవిరెడ్డి ఆధ్వర్యంలో మున్సిపల్ కార్యాలయం ఎదురుగా నున్న కళ్యాణ మండపం వద్ద నిత్యావసర సరుకులు, బియ్యం పంపిణీ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. కౌన్సిలర్లు సమకూర్చిన బియ్యం, నిత్యావసర సరుకులను కమిషనర్ కృష్ణవేణి పారిశుద్ధ్య కార్మికులకు అందజేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ కరోనా వైరస్ వ్యాప్తి నివారణలో భాగంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు లాక్ డౌన్ ప్రకటించారన్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో ప్రజలందరూ గృహాల కే పరిమితమైనప్పటికీ పారిశుద్ధ్య కార్మికులు విధుల్లో కొనసాగుతున్నారన్నారు. పారిశుద్ధ్య కార్మికులకు నిత్యావసర సరుకులు పంపిణీ చేయడం సంతోషకరమన్నారు. ఈ కార్యక్రమంలో టిడిపి నాయకులు, సిపిఎం ఆర్మీ సభ్యులు రావాడ నాయుడు, పైలా గోవింద్ రెడ్డి అప్పలనాయుడు, రుత్తల కృష్ణ పాల్గొన్నారు.
0 Comments