ఈ నెల 22నే ముత్యాలమ్మ తల్లికి పసుపు కుంకుమ సమర్పణ..భక్తులు వారి గృహాల వద్దనే జరుపుకోవాలి..ఆలయానికి ఎవరూ రావద్దు..కరోనా వైరస్ కారణంగా జాతర నిర్వహించలేక పోతున్నాం.. పూజారి సుర్ల అప్పారావు


చింతపల్లి(షేక్ కాశిమ్ వలీ): చింతపల్లి గ్రామ దేవత శ్రీశ్రీశ్రీ ముత్యాలమ్మ అమ్మవారికి  ఈనెల 22న భక్తులు  ఎవరి గృహాల్లో వారే పసుపు కుంకుమలు సమర్పించు కోవాలని పూజారి సుర్ల అప్పారావు తెలిపారు. సోమవారం ఆయన స్థానిక విలేఖర్లతో మాట్లాడుతూ..కరోనా వైరస్ వ్యాప్తి నివారణ లో భాగంగా లాక్ డౌన్ అమలులో ఉండటం వల్ల ముత్యాలమ్మ అమ్మవారి జాతర నిర్వహించలేక పోతున్నామని ఆయన తెలిపారు. భక్తులు స్వయంగా ఆలయానికి వచ్చి పసుపుకుంకుమలు సమర్పించుకునే పరిస్థితి కూడా లేదని ఆయన స్పష్టం చేశారు.
ఈ నేపథ్యంలో ఎవరి గృహాల్లో వారే భక్తులందరూ అమ్మవారికి పసుపు కుంకుమలు సమర్పించి అమ్మ వారి ఆశీస్సులు పొందాలని ఆయన విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో  సుర్ల వంశస్థులు  మాదల తిరుపతిరాజు, సుర్ల  వీరేంధ్ర కుమార్ లు పాల్గొన్నారు.
చింతపల్లి ముత్యాలమ్మ జాతరకు కరోనా వైరస్ ఎఫెక్ట్.. నాటి జ్ఞాపకాలను ఒకసారి నెమరు వేసుకుందాం..

Post a Comment

0 Comments