చింతపల్లి ప్రజలకు ఊరట ..క్వారంటేయిన్ లో నున్న 18 మందికి పరీక్షలు ..

చింతపల్లి
సబ్ డివిజన్ ప్రజలకు కరోనా వైరస్ పై కొనసాగుతున్న ఆందోళన నుంచి  ఊరట లభించింది. చింతపల్లి వైటిసి క్వారంటేయిన్లోనున్న 18 మందికి కరోనా వైరస్ పరీక్షలు నిర్వహించగా నెగిటివ్ వచ్చింది. వివరాల్లోకి వెళితే.. పరుగు జిల్లాలు, రాష్ట్రాలు  నుంచి గిరిజన ప్రాంతానికి వచ్చిన వ్యక్తులను 28 రోజులుగా చింతపల్లి వై టి సి క్వారంటేయిన్ 18 మంది  ఉన్నారు. రెండు రోజుల కిందట స్థానిక ఎంపిడిఓ ప్రేమకర రావు, పాడేరు జిల్లా అదనపు వైద్య ఆరోగ్యశాఖ అధికారి లీలా ప్రసాద్  క్వారంటేయిన్ లోనున్న వ్యక్తులను నర్సీపట్నం ల్యాబ్ కి తరలించారు. వారికి పరీక్షలు నిర్వహించగా నెగిటివ్ రిపోర్టు వచ్చింది. కాగా సోమవారం మరో ఐదుగురిని పరీక్షల కోసం నర్సీపట్నం తరలించినట్లు ఎంపీడీవో తెలిపారు. ఈ ఐదుగురు ఫలితాలు రావాల్సి ఉంది.

Post a Comment

0 Comments