చింతపల్లి(షేక్ కాశిమ్ వలీ): పట్టణ కేంద్రంలో అనారోగ్యంతో బాధపడుతున్న వ్యక్తులకు,నిరుపేదలకు చింతపల్లి -1, 2 వైసిపి ఎంపీటీసీ అభ్యర్థులు పద్మ, జయలక్ష్మి భోజనాలు పెట్టి ఆకలి తీర్చారు. మంగళవారం అంబేద్కర్ జయంతిని పురస్కరించుకుని ఎంపీటీసీ అభ్యర్థులు పట్టణ కేంద్రంలో రోగాలతో బాధ పడుతూ గృహాల కే పరిమితమైన వ్యక్తులకు, వృద్ధులు, నిరుపేదలకు భోజనాలు పెట్టారు. అలాగే అవసరమైన నిత్యావసర సరుకులను కూడా పంపిణీ చేశారు.
0 Comments