మద్యం కోసం పాసులు జారీ : కేరళ ప్రభుత్వం

కేరళ: లాక్‌డౌన్‌ నేపథ్యంలో మద్యం లభించక వింతగా ప్రవర్తిస్తున్న వారు మద్యం కొనుగోలు చేసుకునేలా అనుమతిస్తూ కేరళ ప్రభుత్వం ప్రత్యేక పాస్‌లు జారీచేయాలని నిర్ణయించింది. అయితే దీనికి వైద్యుల నుంచి మద్యానికి బానిస అయినట్లుగా ధ్రువపత్రాన్ని తీసుకురావాల్సి ఉంది. అప్పుడే ఎక్సైజ్‌ శాఖ వారికి అనుమతిస్తుంది. దీన్ని వైద్యుల సంఘం తీవ్రంగా వ్యతిరేకిస్తున్నప్పటికి.. మందు బాబులు సమాజంలో వింతగా ప్రవర్తించడం, ఆత్మహత్యలకు పాల్పడుతుండటంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు ప్రభుత్వం పేర్కొంది. మద్యం దుకాణాలను తెరిచేది కేవలం వాళ్ల ప్రయోజనం కోసమేని స్పష్టం చేసింది.

‘‘లాక్‌డౌన్‌లో మద్యం దుకాణాలు మూసివేయడంతో ఎంతో మంది మద్యానికి బానిసైన వారు మతితప్పి వింతగా ప్రవర్తిస్తున్నారు. మరికొందరు ఆత్మహత్యకు పాల్పడుతున్నారు. ఈ నేపథ్యంలో వారి సమస్యలను పరిష్కరించాలని ప్రభుత్వం నిర్ణయించింది. అయితే వారు వైద్యుల దగ్గరి నుంచి మద్యం లేకుండా ఉండలేని స్థితిలో ఉన్నామనే పత్రాన్ని తీసుకురావాలి. అప్పుడు వారికి తగిన మోతాదులో మాత్రమే మద్యం అందిస్తాం’’ అని వెల్లడించింది. వైద్యులు అందించిన పత్రాన్ని సమీపంలోని ఎక్సైజ్‌శాఖ కార్యలయంలో చూపిస్తే పాస్‌లు అందిస్తామని తెలిపింది.తిరువనంతపురం: లాక్‌డౌన్‌ నేపథ్యంలో మద్యం లభించక వింతగా ప్రవర్తిస్తున్న వారు మద్యం కొనుగోలు చేసుకునేలా అనుమతిస్తూ కేరళ ప్రభుత్వం ప్రత్యేక పాస్‌లు జారీచేయాలని నిర్ణయించింది. అయితే దీనికి వైద్యుల నుంచి మద్యానికి బానిస అయినట్లుగా ధ్రువపత్రాన్ని తీసుకురావాల్సి ఉంది. అప్పుడే ఎక్సైజ్‌ శాఖ వారికి అనుమతిస్తుంది. దీన్ని వైద్యుల సంఘం తీవ్రంగా వ్యతిరేకిస్తున్నప్పటికి.. మందు బాబులు సమాజంలో వింతగా ప్రవర్తించడం, ఆత్మహత్యలకు పాల్పడుతుండటంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు ప్రభుత్వం పేర్కొంది. మద్యం దుకాణాలను తెరిచేది కేవలం వాళ్ల ప్రయోజనం కోసమేని స్పష్టం చేసింది.

‘‘లాక్‌డౌన్‌లో మద్యం దుకాణాలు మూసివేయడంతో ఎంతో మంది మద్యానికి బానిసైన వారు మతితప్పి వింతగా ప్రవర్తిస్తున్నారు. మరికొందరు ఆత్మహత్యకు పాల్పడుతున్నారు. ఈ నేపథ్యంలో వారి సమస్యలను పరిష్కరించాలని ప్రభుత్వం నిర్ణయించింది. అయితే వారు వైద్యుల దగ్గరి నుంచి మద్యం లేకుండా ఉండలేని స్థితిలో ఉన్నామనే పత్రాన్ని తీసుకురావాలి. అప్పుడు వారికి తగిన మోతాదులో మాత్రమే మద్యం అందిస్తాం’’ అని వెల్లడించింది. వైద్యులు అందించిన పత్రాన్ని సమీపంలోని ఎక్సైజ్‌శాఖ కార్యలయంలో చూపిస్తే పాస్‌లు అందిస్తామని తెలిపింది.



Post a Comment

0 Comments