ఈఎంఐ చెల్లింపులపై ఆర్బీఐ కీలక నిర్ణయం


ఢిల్లీ , మార్చి 27 :
కరోనా వైరస్ వ్యాధి కారణంగా ఈఎంఐ చెల్లింపులపై ఆర్బిఐ కీలక నిర్ణయం తీసుకుంది . కరోనా  వైరస్ వ్యాప్తి నివారణకు కేంద్ర ప్రభుత్వం దేశ వ్యాప్తంగా లాక్ డౌన్  ప్రకటించింది . దీంతో పరిశ్రమలు, ప్రభుత్వ కార్యాలయాలు , దుకాణాలు మూతబడ్డాయి . నిర్ణయ సమయంలో నిత్యావసర సరుకుల దుకాణాలు మినహా ఇతర దుకాణాలు తెరుచుకోవడం లేదు. ప్రస్తుతం దేశవ్యాప్తంగా కర్ఫ్యూ వాతావరణం కొనసాగుతుంది. ప్రజలందరూ గృహాల కే పరిమితమయ్యారు . ఉద్యోగులు, కార్మికులు ,వ్యాపారులు వారి పనులను నిలిపివేసి గృహాల్లో నే ఉండిపోతున్నారు. తాజా పరిణామాల నేపథ్యంలో ఉద్యోగులు, వ్యాపారులు, కార్మికులు రుణాల ఈఎంఐ చెల్లింపులు సాధ్యం కాదని ఆర్బిఐ గుర్తించింది  . ఈ మేరకు ఫైనాన్స్ సంస్థలు , బ్యాంకులు మూడు నెలలపాటు ఈ ఎమ్ ఐ ల మినహాయింపు కల్పించాలని ఆదేశాలు జారీ చేసింది. దీంతో రుణాలు పొంది ఈఎమ్ఐ లు చెల్లిస్తున్న ప్రజలకు ఊరట లభించింది .  

Post a Comment

0 Comments