ఏపీలో పెరిగిన కరోనా పాజిటివ్ కేసులు

అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లో లాక్ డౌన్ పాటిస్తున్నా కరోనా పాజిటీవ్ కేసులు భారీగా పెరిగాయి. నిన్న ఒక్కరోజే అంటే.. మంగళవారం ఉదయం 9 గంటల వరకు అందిన సమాచారం మేరకు 17 పాజిటీవ్ కేసులు నమోదయ్యాయి. ఢిల్లీ వెళ్లి వచ్చిన వారు, వారి బంధువులలో వైరస్ వ్యాప్తి చెందినట్లు అధికారులు గుర్తించారు. గత రాత్రి వరకు 164 మందికి కరోనా నిర్దారణ పరీక్షలు చేయగా 147 మందికి నెగిటివ్ రాగా 17 మందికి పాజిటీవ్ వచ్చింది. ఏపీలో ఇప్పటి వరకు అతి ఎక్కువగా ప్రకాశం జిల్లాలో 11 కరోనా పాజిటీవ్ కేసులు నమోదయ్యాయి. ఢిల్లీ నుంచి వచ్చినవాళ్లంతా స్వచ్ఛంగా వైద్య పరీక్షలు చేయించుకోవాలని అధికారులు సూచిస్తున్నారు.  

మత ప్రార్థనల కోసం ఏపీ నుంచి ఢిల్లీకి వెళ్లిన వారి లిస్టు జిల్లాల వారీగా

Post a Comment

0 Comments