గ్రామ వలంటీర్‌పై కత్తితో దాడి

బుచ్చెయ్యపేట: ఆరుబయట చెత్త వేయవద్దని వారించిన గ్రామవలంటీరుపై దాడిచేసిన సంఘటన కోమళ్లపూడిలో సోమవారం జరిగింది. గ్రామానికి చెందిన కలిగిరి నూకాలమ్మ బయట చెత్త వేస్తుండడంతో వలంటీరు సియాద్రి రాజ్‌కుమార్‌  వారించాడు. దీంతో నూకాలమ్మ అతని కంట్లో కారం కొట్టగా, భర్త సత్యారావు, కుమారుడు ఉపేంద్ర కత్తితో దాడిచేశారు. దాడిని గమనించిన వలంటీరు తల్లి చెయ్యి అడ్డంపెట్టింది. అయనప్పటికీ ఇద్దరికీ తీవ్ర గాయాలయ్యాయి. బాధితుడి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్టు ఎస్‌ఐ డి.వెంకన్న తెలిపారు. 

Post a Comment

0 Comments