చింతపల్లి, మార్చీ 26:
ప్రజలందరూ లాక్ డౌన్ పాటిస్తుంటే ఇదే అదునుగా భావించిన గిరిజనేతరుల అక్రమకట్టడాలు శరవేగంగా నిర్మిస్తున్నారని చింతపల్లి డివిజన్ జేఏసీ కమిటీ సభ్యుడు పాంగి ధనుంజయ్ అన్నారు. అక్రమ కట్టడాలు కొనసాగుతున్నాయని వచ్చిన సమాచారంతో జేఏసీ కమిటీ ధనుంజయ్ ఆధ్వర్యంలో తాజంగిలో గిరిజన సంఘాల నాయకులతో సమావేశమయ్యారు. ఈ సందర్బంగా అయన మాట్లాడుతూ ప్రజలందరూ లాక్ డౌన్ లో ఉండగా ఇదే అలుసుగా తీసుకొని చింతపల్లి మండల కేంద్రంలో నివాసం ఉంటున్న ఓ గిరిజనేతరుడు తాపీగా అక్రమ కట్టడం ని కొనసాగిస్తున్న ఫోటోలను గిరిజన సోదరులు కొందరు తమకు పంపించారన్నారు. ఈ విషయమై చింతపల్లి స్థానిక సెక్రెటరీ కి ఫోన్ ద్వారా తెలియపరిచగా, చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారన్నారు . ఇదే పరిస్థితి కొనసాగితే ఆందోళనలు ఉదృతం చేస్తామన్నారు . అక్రమ కట్టడాల పై రెవెన్యూ అధికారులు వెంటనే స్పందించాలన్నారు . ఈ కార్యక్రమంలో తాజంగి జేఏసీ కమిటీ సభ్యులు కూడా వెంకటరమణ, లువాబు గణపతి తదితరులు పాల్గొన్నారు .
0 Comments