చింతపల్లి మార్చి 31:
మండలంలో బుధవారం ఉదయం సూర్యోదయం కాగానే లబ్ధిదారుల గృహాల వద్ద కు గ్రామ వలంటీర్లు వచ్చి పింఛన్ పంపిణీ చేస్తారని చింతపల్లి ఎంపీడీవో ప్రేమకర రావు అన్నారు. మంగళవారం ఆయన స్థానిక విలేకరులతో మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వ ఉత్తర్వుల మేరకు ఏప్రిల్ మాసము తొలిరోజునే లబ్ధిదారుల అందరికీ పింఛన్ అందజేసేందుకు ప్రత్యేక చర్యలు తీసుకున్నామన్నారు . చింతపల్లి మండలంలో 8,080 మంది పింఛన్ లబ్దిదారులు ఉన్నారన్నారు. లబ్ధిదారులకు ఒక కోటి 97 లక్షల 39 వేల 750 రూపాయల నగదు పంపిణీ చేయనున్నామన్నారు. పింఛన్ పంపిణీ చేసేందుకు 391 మంది గ్రామ వలంటీర్లు ఉన్నారని తెలిపారు. అలాగే గ్రామ సచివాలయం కార్యదర్శులు, వెల్ఫేర్ అసిస్టెంట్ లు పింఛన్ పంపిణీ కార్యక్రమంలో పాల్గొంటారన్నారు. కరోనా వైరస్ వ్యాప్తి నివారణలో భాగంగా లబ్ధిదారుల నుంచి సంతకాలు గాని ,వేలిముద్రలు గాని తీసుకోవడం లేదన్నారు. అయితే లబ్ధిదారుల ఫోటోలు వలంటీర్లు తీసుకుంటారని, అందుకని సూర్యోదయం అయిన తర్వాత లబ్ధిదారుల గృహాల వద్ద కు గ్రామ వాలంటీర్లు పింఛన్ తీసుకుని వస్తాను అన్నారు . జనం కోసం ఏ ఒక్కరూ గ్రామ సచివాలయ కార్యాలయాలకు రాకూడదని ఆయన హెచ్చరించారు . ఈ కార్యక్రమంలో యు ఆర్ డి శ్రీనివాసరావు పాల్గొన్నారు .
0 Comments