అమరావతి మార్చి 29: ఏపీలో కరోనా మహమ్మారి వేగంగా వ్యాప్తి చెందుతోంది. తాజాగా మరో ఇద్దరికి కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యింది. దీంతో రాష్ట్రంలో మొత్తం కేసుల సంఖ్య 21కి చేరింది. ఆదివారం ఒక్క రోజు 102 నమూనాలను పరీక్షించగా.. 100 నెగిటివ్ వచ్చాయని వైద్యారోగ్య శాఖ తెలిపింది. ఈ నెల 17న బర్మింగ్‌హామ్ నుంచి వచ్చిన వ్యక్తి ద్వారా తాజాగా నమోదైన ఇద్దరికి కరోనా వ్యాప్తి చెందిందని పేర్కొంది. వారిని ఆస్పత్రికి తరలించినట్లు తెలిపింది. మరోవైపు నెల్లూరు, విశాఖ జిల్లాలకు చెందిన ఇద్దరు కరోనా బాధితులు కోలుకున్నట్లు వెల్లడించింది. గుంటూరు జిల్లాలో ఓ ప్రజాప్రతినిధి కుటుంబం, సిబ్బందికి కరోనా పరీక్షల్లో నెగిటివ్ వచ్చింది.
0 Comments