ఢిల్లీ : వాట్సాప్‌ను ఒకేసారి ఒక మొబైల్‌లో మాత్రమే వాడగలుగుతున్నాం. అయితే ఒకేసారి రెండు మొబైల్స్‌లో వాడుకునే ఆప్షన్ లేదు. టెలిగ్రామ్ లాంటి కొన్ని మెసేజింగ్ యాప్స్‌లో ఉన్న ఈ ఆప్షన్‌ను త్వరలో వాట్సాప్‌లోకి తీసుకొస్తున్నారట. ఇప్పటికే ఈ ఫీచర్ కొంతమంది వాట్సాప్ వినియోగదారులకు అందుబాటులోకి వచ్చిందట. ఒక మొబైల్‌లో వాట్సాప్ వాడుతూ, మరో మొబైల్‌లో లాగిన్ అయితే... మీ ఎన్‌క్రిప్షన్ ఛేంజ్ అయ్యిందని ఒక సందేశం వస్తుందట. వాట్సాప్ బీటా వెర్షన్ 2.20.110లో ఈ ఫీచర్ చూడొచ్చని సమాచారం.
0 Comments