విధులు నిర్వహిస్తున్న పోలీసులకు సానీటైజర్ బాటిల్స్ పంపిణీ చేసిన జర్నలిస్టులు

సానిటైజర్  బాటిల్స్ ను పోలీసులకు అందజేస్తున్న జిల్లా  అధ్యక్షుడు స్వామి 

నర్సీపట్నం మార్చి 28 :
పోలీస్ చెక్ పోస్టుల వద్ద విధులు నిర్వహిస్తున్న పోలీసులకు సానిటైజర్ బాటిల్స్ పంపిణీ చేసినట్టు ఏపీయూడబ్ల్యూజే జిల్లా అధ్యక్షులు సిహెచ్ బిఎల్ స్వామి తెలిపారు. నర్సీపట్నం పరిధిలో ఎనిమిది చెక్ పోస్టుల వద్ద విధులు నిర్వహిస్తున్న పోలీసుల వద్దకు వెళ్లి సాని టైజర్ బాటిల్స్  అందజేశారు. ఈ సందర్భంగా స్వామి మాట్లాడుతూ..కరోనా  వైరస్ వ్యాప్తి నివారణలో  జర్నలిస్టులు సైతం పాలి  భాగస్తులు కావాలని ఏపీ డబ్ల్యూ జె సభ్యులు, కుటుంబాలకు దూరంగా ఉంటూ విధులు నిర్వహిస్తున్న పోలీసులకు తమ వంతుగా సహకారం అందించాలని సాని టైజర్ బాటిల్స్ పంపిణీ చేయడం జరిగిందన్నారు. జర్నలిస్టుల సేవలను గుర్తించిన టౌన్ సిఐ స్వామి నాయుడుజర్నలిస్టు అభినందించారు .ఈ కార్యక్రమంలో ఏపీయూడబ్ల్యూజే జిల్లా అధ్యక్షులు, ఏపీ ఈ ఎం జె ఎ జిల్లా కన్వీనర్ కిషోర్, నర్సీపట్నం  ప్రెస్ క్లబ్ నాయకులు వార్త మాటీవీ తిరుపతిరావు, 10టీవీ విజయ్ ,దీక్ష శ్రీను, ఐన్యూస్ నాయుడు,ఆంధ్రప్రభ ప్రభాకర్  తదితరులు పాల్గొన్నారు.

Post a Comment

0 Comments