విశాఖ ఏజెన్సీలో గిరిజన సహకార సంస్థ డిఆర్ డిపోల ద్వారా ఆదివారం నుంచి రేషన్ పంపిణీ చేయనున్నట్టు డిఎం కే .పార్వతమ్మ తెలిపారు. శనివారం ఆమె చింతపల్లిలో స్థానిక విలేకరులతో మాట్లాడుతూ దేశవ్యాప్తంగా లాక్ డౌన్ అమలులో ఉన్నందున, రాష్ట్ర ప్రభుత్వ ఉత్తర్వుల మేరకు ఏప్రిల్ నెలకు సంబంధించిన రేషన్ ఈ నెల 29 నుంచి పంపిణీ చేసేందుకు ప్రత్యేక ఏర్పాట్లు చేశామన్నారు. ఇప్పటికే డిపోలకు సరుకులను తరలించామన్నారు. ఆదివారం ఉదయం నుంచి డిపోల ద్వారా రేషన్ పంపిణీ జరుగుతుందన్నారు. తెల్లరేషన్ కార్డు కలిగిన వ్యక్తులకు ఒక యూనిట్ కి గాను ఐదు కేజీలు బియ్యం , కిలో కందిపప్పు, అరకిలో పంచదార , అంత్యోదయ కార్డులు కలిగిన లబ్ధిదారులకు 35 కిలోల బియ్యం , కేజీ చొప్పున కంది పప్పు, పంచదార పంపిణీ చేయడం జరుగుతుందన్నారు. లబ్ధిదారులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని అన్నారు . లాక్ డౌన్ అమల్లో ఉన్నందున , కుటుంబం నుంచి ఒక్కరే డిపోకు వెళ్లాలని, లబ్ధిదారులు సామాజిక దూరం పాటించాలని ఆమె తెలిపారు. లబ్ధిదారులు బయోమెట్రిక్ వేయాల్సిన అవసరం లేదని కేవలం రేషన్ కార్డు ఒకటి తీసుకుని వస్తే సరిపోతుంది అని ఆమె తెలిపారు. రేషన్ తీసుకోవడానికి పిల్లలు, వృద్ధులు వెళ్లరాదని ఆమె తెలిపారు. డిపోలో ఇతర సరుకులు కూడా వినియోగదారులకు అందుబాటులో ఉంటాయని ఆమె తెలిపారు. ఈ కార్యక్రమంలో జిసిసి మేనేజర్ విజయ్ కుమార్, అకౌంటెంట్ కొండన్న పాల్గొన్నారు
0 Comments