కరోనా నియంత్రణ కోసం రెండునెలల వేతనం పీఎం నిధికి కేటాయించిన అరకు ఎంపీ మాధవి

అరకు, మార్చీ 26:
చైనాలో పురుడుపోసుకున్న కరోనా వైరస్ మన భారత దేశంలోనూ అతివేగంగా విస్తరిస్తున్నందున ప్రజకు తనవంతుగా సహాయం చెయ్యనే ఉద్దేశ్యంతో అరకు ఎంపీ గొడ్డేటి మాధవి తన రెండునెలల వేతనం పీఎం నిధికి అందజెయ్యనున్నట్టు ఆమె తెలిపింది.

వివరాల్లోకి వెళితే .. భారత దేశంలో కరణ నియంత్రణ కోసం కేంద్రం లాక్ డౌన్ ప్రకటించింది. ప్రజల సంక్షేమం కోసం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పలు సంక్షేమ పథకాలు అమలులోకి తీసుకొస్తుంది. దింతో తనవంతుగా సహకారం అందించాలనే లక్ష్యంతో ఎంపీ మాధవి రెండునెలల వేతనం పీఎం నిధికి కేటాయించింది. ఇప్పటికో  ఒక నెల వేతనం అందజేసిన ఆమె మరో నెల గౌరవ వేతనం కూడా పీఎం నిధికి పంపిస్తామని ప్రకటించారు. అలాగే జిల్లాకు గానూ ఎంపీ ల్యాండ్స్ నుంచి రూ. 10లక్షలను జిల్లాకలెక్టర్ కి అందజేసినట్టు ఆమె  తెలిపారు. ఎంపీ ఉదారతను ఆదివాసీలు హర్షిస్తున్నారు. మాధవిని ఆదర్శంగా తీసుకొని ప్రజాప్రతినిధులు ముందుకు రావాలని ప్రజలు కోరుతున్నారు. 

Post a Comment

0 Comments