నేటి నుంచి చింతపల్లి పట్టణ కేంద్రంలో తెరుచుకోనున్న కిరాణా దుకాణాలు: ఎంపీడీవో ప్రేమకర రావు

చింతపల్లి మార్చి 29 :
పట్టణ కేంద్రంలో సోమవారం నుంచి నిర్ణీత సమయాల్లో కిరాణా దుకాణాలు యధావిధిగా తెరుచుకుంటాయి అని చింతపల్లి ఎంపీడీవో ప్రేమకర  రావు తెలిపారు. కరుణ వైరస్ వ్యాప్తి నివారణ భాగంగా, జన సంచారం నియంత్రించాలనే  లక్ష్యంతో పోలీస్ ,మండల పరిషత్, రెవెన్యూ అధికారులు  కిరాణా సరుకుల ను గ్రామ వాలంటరీ ల ద్వారా డోర్ డెలివరీ చేయాలని నిర్ణయించారు. ఈ మేరకు ఆదివారం కిరాణా దుకాణాలు మూతబడ్డాయి . అయితే గ్రామ వాలంటీర్ల ద్వారా కిరాణా సరుకులు డోర్ డెలివరీ చేసేందుకు పలు సమస్యలను అధికారులు ఎదుర్కోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. దీంతో ఈ నిర్ణయాన్ని అధికారులు విరమించుకున్నారు . ఈ సందర్భంగా ఆదివారం ఎంపీడీవో స్థానిక విలేకరులతో మాట్లాడుతూ కిరాణా సరుకుల డోర్ డెలివరీ నిలిపివేశామని, యధావిధిగా ఉదయం 6 గంటల నుంచి 10 గంటల వరకు కిరాణా దుకాణాలు అన్నీ తెరుచుకుంటాయి అని , నిర్ణీత సమయంలో వినియోగదారులు కిరాణా  దుకాణాల్లో కి వెళ్లి అవసరమైన సరకులను కొనుగోలు చేసుకోవచ్చు అన్నారు. అయితే వినియోగదారులు కచ్చితంగా దుకాణాల వద్ద సామాజిక దూరం పాటించాలని, కుటుంబం నుంచి ఒకరు మాత్రమే దుకాణానికి వెళ్లాలని, ఒకసారి గృహం నుండి బయటకు వచ్చిన వ్యక్తి కనీసం రెండు మూడు రోజులకు సరిపడా సరుకులు తీసుకుని వెళ్లాలని ఆయన సూచించారు. ప్రజలందరూ కరోనా వైరస్  వ్యాప్తి నివారణకు ప్రభుత్వం తీసుకున్న లాక్ డౌన్ నిర్ణయానికి ప్రతి ఒక్కరూ సహకరించాలని ఆయన విజ్ఞప్తి చేశారు.     

Post a Comment

0 Comments