రాష్ట్రప్రభుత్వం చొరవ తో వృద్ధులు, దివ్యాంగులు, ఒంటరి మహిళలు పొద్దు పొద్దున్నే పింఛన్ అందుకున్నారు. గ్రామ వలంటీర్లు సూర్యోదయం కాగానే స్మార్ట్ ఫోన్, నగదు పట్టుకొని ఇంటింటికి వెళ్లి లబ్ధిదారులకు అందజేశారు. విశాఖ ఏజెన్సీ చింతపల్లి మండలంలో లంబసింగి, రాజుపాకలు, తాజంగి ప్రాంతాల్లో గ్రామ వాలంటీర్లు పంపిణీ చేస్తున్న పింఛన్ కార్యక్రమాన్ని పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన ""అన్వేషణ న్యూస్"" తో మాట్లాడుతూ.. పింఛన్ పంపిణీ కి అవసరమైన ముందస్తు ఏర్పాట్లు మంగళవారమే పూర్తి చేశామన్నారు. బుధవారం మధ్యాహ్నానికి వాలంటీర్లు పింఛన్ పంపిణీ పూర్తి చేశారన్నారు. లబ్ధిదారుల నుంచి వేలిముద్రలు గాని, సంతకాలు గాని తీసుకోలేదన్నారు. కేవలం లబ్ధిదారుల ఫోటోలను తీసుకొని పింఛన్ అందజేశామన్నారు. ఓవైపు కరోనా వ్యాప్తి చెందుతూ ప్రజలు గృహాల నుంచి బయటకు రాలేక పోతున్న అప్పటికీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి చొరవతో తొలిరోజే పింఛన్ అందుకోవడం చాలా సంతోషంగా ఉందని లబ్ధిదారులు చెబుతున్నారని ఆయన చెప్పారు. ఎంపీడీవో తో పాటు ఈవోఆర్ డి శ్రీనివాసరావు ఉన్నారు.
0 Comments