అనంతగిరి: అంబులెన్స్ వెళ్లేందుకు దారిలేక ఓ నిండు గర్భిణి ప్రసవ వేదన అనుభవించింది. ఈ సంఘటన మండలంలోని పెదకోట పంచాయతీ పోడెల్తిలో శనివారం చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన పాతుని సరస్వతికి నెలలు నిండడంతో పినకోట పీహెచ్‌సీకి ఆశ కార్యకర్త సమాచారం అందించింది. వైద్య సిబ్బంది అంబులెన్స్‌లో బయలుదేరారు. అయితే కుడియా, జాలాడ ప్రాంతాల్లో రహదారులకు అడ్డంగా చెట్లు నరికి పడేయడంతో వాటిని తొలగించుకుంటూ బంగారుమెట్ట వరకు చేరుకున్నారు.అక్కడ తొలగించడానికి వీలులేనంత పెద్ద మామిడి చెట్టును ఉండడంతో ముందుకు వెళ్లే పరిస్థితి కనిపించలేదు. దీంతో ఆటోలో గర్భిణిని హుకుంపేట మండలం ఉప్ప పీహెచ్‌సీకి తరలించారు. కరోనా భయంతో గ్రామాల్లోకి రాకుండా వేస్తున్న కంచెలు ప్రాణాల మీదకు తెస్తున్నాయంటున్నారు. వీటిని తొలగించాలని ఐటీడీఏ పీవో బాలాజీ ఆదేశించినప్పటికీ చర్యలు కనిపించడం లేదని వాపోతున్నారు.
(ఐటీడీఏ పీవో గారి ప్రకటన
https://anwesananews.blogspot.com/2020/03/blog-post.html )
0 Comments