చింతపల్లి పట్టణ కేంద్రంలో నేటి నుంచి కిరాణా దుకాణాలు బంద్...గ్రామ వాలెంటర్ల్లు ద్వారా డోర్ డెలివరీ కి సన్నాహాలు ..ఏఎస్పి ఎస్. సతీష్ కుమార్

చింతపల్లి మార్చి 28
పట్టణ కేంద్రంలో ఆదివారం  నుంచి కిరాణా దుకాణాలు మూత పడతాయని , సరుకులను గ్రామ వాలంటీర్ల ద్వారా గృహాలకు డోర్ డెలివరీ చేసేందుకు ఏర్పాట్లు చేశామని చింతపల్లి ఏఎస్పి ఎస్. సతీష్ కుమార్ తెలిపారు. శనివారం చింతపల్లి మండల పరిషత్ కార్యాలయంలో ప్రత్యేక అధికారి రవీంద్రనాథ్, ఎంపీడీవో ప్రేమకర్రావు  ఆధ్వర్యంలో వర్తకులు, గ్రామ వాలంటీర్ల  సమావేశం జరిగింది. ఈ సందర్భంగా ఏఎస్పీ మాట్లాడుతూ... పట్టణ కేంద్రంలో కిరాణా దుకాణాలు వద్ద నిత్యావసర సరుకులు కొనుగోలు చేసేందుకు వినియోగదారులు బారులు తీరుతున్నారని అన్నారు. దుకాణాల ఎదుట క్యూలో నిల్చోవడం వినియోగదారులకు కష్టంగా ఉందన్నారు . అలాగే నిత్యావసర సరుకుల కోసం వచ్చే ప్రజల సంచారం కూడా అధికంగా ఉందన్నారు. ఈ సమస్యను పరిష్కరించేందుకు గ్రామ వాలంటీర్ల ద్వారా నిత్యావసర సరుకులను దుకాణాల నుంచి ప్యాకింగ్ చేసి గృహాలకు పంపిణీ చేయాలని నిర్ణయించామన్నారు. వినియోగదారులు అవసరమైన నిత్యావసర సరుకుల జాబితా, నగదు గ్రామ వాలంటీర్లకు అందజేస్తే వాళ్లు దుకాణాల వద్దకు వెళ్లి అవసరమైన సరుకులను కొనుగోలు చేసి గృహాల వద్దకు తీసుకొని వచ్చి అందజేస్తారన్నారు. ఈ విధంగా డోర్ డెలివరీ చేసినందుకు కుటుంబ సభ్యులు అదనంగా రూ 5 రూపాయలు ఆటో చార్జి కి  చెల్లించాలని ఆయన అన్నారు. గ్రామ వలంటీర్ కి  కేటాయించబడిన 50 కుటుంబాల వద్దకు ప్రతిరోజు వెళ్లి వారి అవసరాలను తెలుసుకొని సరుకులను దుకాణం నుంచి అందజేసేందుకు ఏర్పాట్లు చేశామన్నారు . దీనికి వర్తకులు కూడా అంగీకరించారని, అలాగే వలంటీర్లకు దుకాణాలను కూడా కేటాయించామన్నారు. డోర్ డెలివరీ సత్ఫలితాలను ఇస్తే ఇతర ప్రాంతాల్లో కూడా అమలు చేస్తామన్నారు .ఈ కార్యక్రమంలో సర్కిల్ ఇన్స్పెక్టర్ సన్యాసి నాయుడు, యు ఆర్ డి శ్రీనివాసరావు పాల్గొన్నారు.    

Post a Comment

0 Comments