పాడేరు, మార్చీ 26:
విశాఖ ఏజెన్సీ పాడేరు డివిజన్ కేంద్రంలో ఓ సెల్ పాయింట్ వ్యాపారి రామిరెడ్డి 50మంది పేదలకు అన్నం పెట్టి మనసున్న మా రాజు అనిపించుకున్నాడు. వివరాల్లోకి వెళితే,.. పాడేరు పట్టాణ కేంద్రంలో చాలామంది నిరుపేదలు, ఆనాధలు , సాధువులు, భిక్షాటన చేసుకుంటూ జీవిస్తుంటారు . కరోనా వైరస్ కారణంగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు లాక్ డౌన్ ప్రకటించాయి. దీంతో దుకాణాలు మూతబడ్డాయి. జనసంచారం స్తంభించి పోయింది. ప్రజలందరూ గృహాలకు పరిమితమయ్యురు. దుకాణాలు ఎప్పుడు తెరుచుకుంటాయో తెలియక ప్రజాలు వారానికి సరిపడిన కూరగాయలు, నిత్యావసర సరుకులు కొనుక్కొని గృహాల్లో ఉంటూ టీవీలకు అతుక్కుపోతున్నారు. గ్రామం, పట్టణంలో ఏమిజరుగుతోదో తీసుకోవడానికి వాట్సాఅప్ , న్యూస్ ఛానల్స్ చూస్తున్నారు. అందరికి ఆహారం దొరుకుతుందా, నిత్యావసరాలు తిరుతున్నాయా అని ఆలోచించేవారు కరువయ్యారు. మనకు అన్ని ఉన్నాయా లేదా అనే ప్రతిఒక్కరు చూసుకుంటున్నారు. అయితే పాడేరు పట్టణానికి చెందిన సెల్ పాయింట్ వ్యాపారి రామిరెడ్డి భిన్నంగా ఆలోచించాడు.
రోడ్డుపై వున్న నిరుపేదలు, ఆనాధలు , సాధువులు ఆకలి తీరుతుందా ..? వాళ్లకు అన్నం పెట్టేవారు ఎవరు అని ఆలోచించాడు. మదిలో మెదిలిన ఆలోచనకు గురువారం కార్యరూపం ఇస్తూ గృహం లో వంట చేయించి స్వయంగా తానే పట్టణంలో తిరుగుతూ ఆకలితో ఆహరం కోసం ఎదురుచూస్తున్నా నిరుపేదలు, ఆనాధలు , సాధువులకు అన్నం పెట్టి ఆకలి తీర్చాడు. దింతో స్థానికులు , నిరుపేదలు, ఆనాధలు , సాధువులు రామిరెడ్డిని అభినందించారు. రామిరెడ్డి స్ఫూర్తిగా తీసుకొని మరికొంతమంది మనసున్న వ్యక్తులు ముందుకొస్తే ఆకలితో అలాటిస్తున్న నిరుపేదలు, ఆనాధలు , సాధువుల ఆకలి తీరుతుంది.
0 Comments