22 రోజుల శిశువును వదిలి విధుల్లో చేరిన జీవీఎంసీ కమిషనర్ సృజన


విశాఖపట్నం మార్చి 30:
ఐఏఎస్ అధికారిగా ఆపత్కాలంలో ప్రజలకు అండగా నిలవాలని  ఇరవై రెండు రోజుల శిశువుని గృహంలో  విడచి విధుల్లోకి చేరారు జీవీఎంసీ కమిషనర్ సృజన. ఆరు నెలల ప్రసూతి సెలవు ఉన్నప్పటికీ కరోనా వైరస్ ఓవైపు ముంచుకొస్తుండటంతో ప్రజలకు సేవ చేయాలనే భావన ఆమెలో కలిగింది.  బాలింత అయినప్పటికీ హుటాహుటిన వ్యక్తిగత నిర్ణయంతో తన ప్రసూతి సెలవు రద్దు చేసుకొని  కమిషనర్ విధుల్లోకి చేరారు. వివరాల్లోకి వెళితే జీవీఎంసీ కమిషనర్ డాక్టర్ జి . సృజన ఇటీవల మగబిడ్డకు జన్మనిచ్చారు. శిశువుకి కనీసం నెలరోజులు కూడా నిండక పోయిన తన బాధ్యత ముందు మాతృత్వం చిన్నబోయింది. ప్రస్తుతం కమిషనర్ గా  జీవీఎంసీ పరిధిలో కరోనా వైరస్ భారీన ప్రజలు పడకుండ గా తీసుకోవలసిన ముందస్తు చర్యల్లో ఆమె చురుగ్గా పాల్గొంటున్నారు. కింది స్థాయి ఉద్యోగులను అప్రమత్తం చేస్తూ , అధికారుల సహకారంతో ఆమె ప్రజలకు మెరుగైన సేవలు అందిస్తున్నారు. క్షణం తీరిక లేకుండా గా విధులు నిర్వహిస్తున్నారు.  నిత్యావసర సరుకులు ఇతర సదుపాయాల కోసం ప్రజలు ఎక్కడ ఇబ్బంది పడకుండా గా ముందస్తు జాగ్రత్తలు తీసుకుంటున్నారు.
ఐఏఎస్ అధికారిగా విధులు నిర్వహిస్తూనే మరోవైపు కుటుంబ సభ్యుల సహకారంతో తల్లిగా శిశువుకి సేవలందిస్తున్నారు. అవకాశం చూసుకుని నాలుగు గంటలకు ఒకసారి గృహానికి వెళ్లి బిడ్డకు పాలిచ్చి వెను వెంటనే విధుల్లోకి చేరుతున్నారు . అయితే తన భర్త , కుటుంబ సభ్యుల సహకారం తనకు పూర్తిగా ఉందని, శిశువు ఆలనాపాలనా తన భర్త కుటుంబ సభ్యులు చూసుకుంటున్నారని ఆమె ఓ పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో తెలిపారు.  

Post a Comment

0 Comments