చింతపల్లి మార్చి 26 :
చింతపల్లి మండలం బురిసింగి ప్రాథమిక పాఠశాలలో సెకండరీ గ్రేడు టీచర్ గా పనిచేస్తున్న వంతల కృష్ణమూర్తి అనారోగ్యంతో మృతి చెందారు. వివరాల్లోకి వెళితే ..తాజంగి గ్రామానికి చెందినఉపాధ్యాయుడు కృష్ణమూర్తి కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్నాడు . శుక్రవారము ఉపాధ్యాయ ఆరోగ్య పరిస్థితి విషమించడంతో ఆయన తుది శ్వాస విడిచారు. ఆయన మృతికి ఉపాధ్యాయ సంఘాల నాయకులు ప్రగాఢ సానుభూతిని వ్యక్తం చేశారు. అలాగే ఉపాధ్యాయుడు అంత్యక్రియలకు హాజరైన మండల విద్యాశాఖ అధికారి జి. బోడం నాయుడు హాజరై ఉపాధ్యాయుడు తండ్రికి తక్షణ సహాయంగా రూ 15 వేల నగదును అందజేశారు . ఉపాధ్యాయుడుకి ప్రభుత్వపరంగా అందాల్సిన రాయితీలు సకాలంలో అందజేసేందుకు కృషి చేస్తామని ఆయన తెలిపారు .
0 Comments