నర్సీపట్నం: అరకు వ్యాలీ మండలం కొత్త బల్లుగూడ గ్రామానికి చెందిన 14 మంది గిరిజనులను నర్సీపట్నం ప్రాంతీయ ఆస్పత్రి ఐసోలేషన్ వార్డులో ఉంచారు. కాకినాడ హార్బర్‌లో కూలిపని చేసే వీరు లాక్‌డౌన్‌తో తమ సొంతూరు వస్తుండగా పోలీసులు అడ్డుకుని ఐసోలేషన్ వార్డుకు తరలించారు. వీరికి ఎటువంటి అనారోగ్య సమస్యలు లేనందున హోమ్ క్వారంటైన్‌లో ఉంచితే సరిపోతుందని అధికారులు తెలిపారు. అలాగే విజయవాడ నుంచి ఇద్దరు సాఫ్ట్‌వేర్ ఉద్యోగులు నర్సీపట్నం రాగా వారికి పరీక్షలు చేసి విశాఖ విమ్స్‌కు తరలించామన్నారు.
0 Comments