మహారాష్ట్రలో కొవిడ్-19 తీవ్రత అధికంగా ఉంది. తాజాగా ఇక్కడ మృతుల సంఖ్య 8కు చేరింది. ఇప్పటికే రాష్ట్రంలో 218కేసులు నమోదుకాగా ఇప్పటివరకు 25మంది కోలుకున్నట్లు అధికారులు వెల్లడించారు. కేరళలో 213కరోనా పాజిటివ్ కేసులు నమోదుకాగా ఒకరు మరణించారు. గుజరాత్‌లో కొవిడ్-19 మృతుల సంఖ్య ఐదుకు చేరింది. కర్ణాటకలో ఈ కేసుల సంఖ్య 85కి చేరగా ముగ్గురు మరణించారు. దిల్లీ, మధ్యప్రదేశ్, జమ్మూ కశ్మీర్‌లో కొవిడ్19 కారణంగా ఇద్దరు మరణించారు. బిహార్, హిమాచల్‌ప్రదేశ్, పంజాబ్, తమిళనాడు, తెలంగాణ, పశ్చిమబెంగాల్‌లో ఒకరుచొప్పున మరణించారని ప్రభుత్వం వెల్లడించింది. తెలంగాణలో ఇప్పటివరకు 70కరోనా పాజిటివ్ కేసులు నమోదుకాగా ఆంధ్రప్రదేశ్‌లో ఈ కేసుల సంఖ్య 23 చేరినట్లు ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు ప్రకటించాయి.
అయితే ఈ సమయంలో ప్రభుత్వం తీసుకుంటున్న కఠిన చర్యలు సామాన్యులకు ఇబ్బంది కలిగిస్తే క్షమించాలని ప్రధానమంత్రి నరేంద్రమోదీ నిన్న అభ్యర్థించారు. కరోనా మహమ్మారిని జయించడంలో ఇలాంటి చర్యలు తప్ప వేరేమార్గం లేదని స్పష్టం చేసిన విషయం తెలిసిందే.
0 Comments