100 నిమిషాలు 100 SMSలు ఉచితం:జియో

దిల్లీ: వినియోగదారులకు ఏప్రిల్‌ 17 వరకు 100 నిమిషాల టాక్‌టైమ్‌, 100 ఎస్‌ఎమ్‌ఎస్‌లను ఉచితంగా ఇస్తున్నట్టు రిలయన్స్‌ జియో ప్రకటించింది. మహమ్మారి కొవిడ్‌-19 కారణంగా దేశవ్యాప్తంగా లాక్‌డౌన్‌ కొనసాగుతోంది. చాలాచోట్ల దుకాణాలు తెరవకపోవడంతో రీఛార్జి చేసుకోవడం ఇబ్బందిగా మారుతోంది. ఈ నేపథ్యంలో జియో వినియోగదారులందరికీ ఈ ఆఫర్‌ను వర్తింప చేస్తున్నట్టు ఆ సంస్థ ప్రకటించింది. రీఛార్జి చేయకున్నా లాక్‌డౌన్‌ పూర్తయ్యే వరకు ఇన్‌కమింగ్‌ కాల్స్‌ సదుపాయం కల్పిస్తున్నామని వెల్లడించింది.

""ఈ అత్యవసర సమయంలో జియో ఫోన్‌ వినియోగదారులందరికీ 10 రెట్ల ప్రయోజనాలు. 100 నిమిషాల కాల్స్‌, 100 ఎస్‌ఎమ్‌ఎస్‌లు ఉచితంగా అందజేస్తున్నాం"" అని జియో ట్వీట్‌ చేసింది. టెలికాం సంస్థలకు లాక్‌డౌన్‌ నుంచి మినహాయింపు ఇచ్చినప్పటికీ చాలా చోట్ల దుకాణాలు తెరిచే అవకాశం లేదని ట్రాయ్‌ తెలిపింది. వినియోగదారులందరూ ఆన్‌లైన్‌లో రీఛార్జి చేసుకోలేరు కాబట్టి ప్రస్తుతం కొనసాగుతున్న పథకాల గడువును పెంచాలని టెలికాం ఆపరేటర్లను కోరింది.

ట్రాయ్‌ సూచన మేరకు సోమవారం ఎయిర్‌టెల్‌ తమ 8 కోట్ల వినియోగదారులకు కాలపరిమితిని ఏప్రిల్‌ 17 వరకూ పొడిగించింది. పది రూపాయాల టాక్‌టైమ్‌ను జత చేసింది. వొడాఫోన్‌ ఐడియా లిమిటెడ్‌ సైతం ఇదే ఆఫర్‌ను ప్రకటించినా కేవలం పేద వర్గాలకు మాత్రమే ఇస్తామని తెలిపింది

Post a Comment

0 Comments